వీళ్లిద్దరూ ప్రేమికులు. కులాలు వేరైనా పెద్దలను ఎదురించి వివాహం చేసుకున్నారు. షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే? 6 నెలల తర్వాత యువతి తల్లిదండ్రులు కూతురి ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి రావాలంటూ కబురు పంపారు. వారు కోరినట్లే ఇద్దరూ వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో ఏమో కానీ..!
ఈ మధ్యకాలంలో చాలా మంది యువత పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లను కాదని ప్రేమ వివాహాలకు మొగ్గుచూపుతున్నారు. ముఖ్యంగా ఇందులో కులాంతర వివాహాలే ఎక్కువ. అయితే ముందుగా పెద్దలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. చివరికి ఒప్పుకోకపోవడంతో ఎదురించి మరీ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అచ్చం ఇలాగే ఓ యువకుడు కులాంతర వివాహం చేసుకున్నాడు. ఇక మొదట్లో యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. పెళ్లైన ఆరు నెలల తర్వాత యువతి తల్లిదండ్రులు వారికి ఫోన్ చేసి.. ఇద్దరూ మా ఇంటికి రావాలంటూ కబురు పంపారు. వారు కోరినట్టుగానే పెళ్లి చేసుకున్న ఆ జంట యువతి ఇంటికి వెళ్లారు. ఇక మరుసటి రోజే యువకుడు తన ఇంటికి వెళ్లి షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ హస్తినాపూర్ కు చెందిన ఓ యువతితో గోపినాయక్ అనే యువకుడికి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం రాను రాను ప్రేమగా మారింది. అలా వీరి ప్రేమాయణం చాలా ఏళ్ల పాటు కొనసాగింది. చివరికి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ, కులాలు వేరు కావడంతో యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. ఇక చేసేదేం లేక గోపినాయక్ తన ప్రియురాలిని పెళ్లి చేసుకున్నాడు. కట్ చేస్తే.. పెళ్లైన ఆరు నెలల తర్వాత యువతి కుటుంబ సభ్యులు గోపి నాయక్ కు ఫోన్ చేశారు. జరిగిందేదో జరిగిపోయింది.. మా ఇంటికి రావాలంటూ దంపతుల ఇద్దరినీ ఆహ్వానించారు. వారు కోరినట్లుగానే ఇద్దరు ఇటీవల యువతి ఇంటికి వెళ్లారు.
రాత్రంతా వారి ఇంట్లోనే ఉన్నారు. ఇక మరుసటి రోజు గోపి నాయక్ తన ఇంటికి వెళ్లాడు. రాత్రి యువతి ఇంట్లో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ, మరుసటి రోజు గోపి నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మృతుడి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం పోలీసులు స్పందించి హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత మృతుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే యువతి తల్లిదండ్రులు అవమానించడం వల్లే గోపి నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు. తాజాగా చోటు చేసుకున్న ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.