జహంగీర్-కనీజబేగం దంపతులు. వీరికి 20 ఏళ్ల కిందట వివాహం జరిగింది. కొంత కాలానికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు జన్మించారు. భర్త నగరంలో ఆటో నడిపేవాడు. అంతా బాగానే ఉన్నా.. ఈ ఒక్క కారణంతో భర్త భార్యను ఏకంగా 20 ఏళ్ల పాటు ఇంట్లో బంధించి నరకం చూపించాడు. అంతేకాకుండా తాజాగా మరో దారుణానికి పాల్పడ్డాడు. అసలేం జరిగిందంటే?
వాళ్లిద్దరికీ 2004లో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. కొన్నాళ్లకి నలుగురు పిల్లలు జన్మించారు. అయితే రాను రాను భర్త రాక్షసుడిలా తయారయ్యాడు. ప్రతీ చిన్న విషయానికి అనుమానిస్తూ భార్యను హింసించేవాడు. నలుగురు సర్దిచెప్పే ప్రయత్నం చేసినా.. అవేం పట్టించుకోకుండా భార్యకు చూపించాడు. ఇతగాడి మరో దారుణం ఏంటంటే? ఏకంగా 20 ఏళ్లుగా భార్యను ఇంట్లో బంధించి ఎవరూ ఊహించని కిరాతకానికి పాల్పడ్డాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. ఈ క్రైమ్ స్టోరీలో అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ పాతబస్తికి చెందిన జహంగీర్ కు పంజాగుట్టకు చెందిన కనీజబేగం (40)తో 2004లో వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని రోజులు భార్యను ప్రేమగా చూసుకుంటున్నట్లు నటించాడు. నగరంలో ఆటో నడిపిస్తూ భార్య అడిగిందల్లా కొనిపెట్టాడు. మంచి భర్త దొరికాడని భార్య కూడా మురిసిపోయింది. మంచి భర్త దొరికాడని భార్య కూడా మురిసిపోయింది. అలా కొన్నాళ్ల తర్వాత ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు జన్మించారు. ఇక విషయం ఏంటంటే? జహంగీర్ భార్యను తరుచు అనుమానించడం మొదలు పెట్టాడు. ఎవరితో మాట్లాడినా కూడా ఆమెకు లేనిపోని సంబంధాలు అంటకట్టేవాడు. పక్కింటివాళ్లతో మాట్లాడనిచ్చేవాడు కాదు. అంతెందుకు.. జహంగీర్ తల్లితో కూడా మాట్టాడొద్దని ఆంక్షలు విధించాడు ఈ నర రూపరాక్షసుడు.
భార్య పరాయి మగాళ్లతో మాట్లాడుతుందనే అనుమానంతో ఏకంగా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. అలా ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు.. ఏకంగా 20 ఏళ్ల పాటు భార్యను ఇంట్లో బంధించి నరకం చూపించాడు. ఈ దుర్మార్గుడు ఎన్నో సార్లు భార్యతో గొడవ పడేవాడు. కనీజబేగం తల్లిదండ్రులు కలగజేసుకుని కూతురికి సర్దిచెప్పి భర్త ఇంటికి పంపేవారు. ఇకపోతే.. జహంగీర్ ఈ మధ్యకాలంలో లంగర్ హౌస్ కు మకాం మార్చాడు. ఇక్కడే తన భార్యాపిల్లలతో నివాసం ఉండేవాడు. అయితే ఇటీవల తన చిన్న కూతురిని పిలుచుకుని.. మీ అమ్మ ఈ రోజు ఎవరితో మాట్లాడిందని అడిగగా, పక్కింటి వాళ్లతో మాట్లాడిందని కూతురు చెప్పింది. ఆమె మాటలు విన్న తండ్రి ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. ఇదే విషయంపై భార్యను ప్రశ్నించి ఆమెపై దాడి చేశాడు. దీంతో కనీజబేగం భయపడి ఎండీలైన్స్ లో నివాసం ఉండే తన సోదరుడి ఇంటికి వెళ్లింది.
జహంగీర్ శనివారం తన భార్య వద్దకు వెళ్లి గొడవలు లేకుండా ఉందామంటూ నమ్మబలికి పిల్లలను అక్కడే వదిలేసి భార్యను తీసుకుని తన ఇంటికి వెళ్లాడు. ఇక అదే రాజు రాత్రి భార్యాభర్తలు కలిసి భోజనం చేశారు. నిద్రపోయే సమయానికి భర్త మరోసారి భార్యతో గొడవకు దిగాడు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. కోపంతో ఊగిపోయిన భర్త జహంగీర్.. ఇంట్లో ఉన్న చున్నీతో భార్య గొంతుకు బిగించాడు. భార్య చనిపోయిందని తెలుసుకున్న భర్త.. అదే రాత్రి లంగర్ హౌస్ లో స్టేషన్ కు వెళ్లాడు. నా భార్యను నేనే చంపాను అంటూ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు వెంటనే జహంగీర్ ఇంటికి వెళ్లి కనీజబేగం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక కనీజబేగం చనిపోయిందని తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం మృతురాలి సోదరుడు జహంగీర్ దారుణంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అనుమానంతో భార్యను 20 ఏళ్లు ఇంట్లో బంధించి చివరికి దారుణంగా హత్య చేసిన ఈ దుర్మార్గుడి కిరాతకంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.