మనిషికి ఏ కష్టం వచ్చినా గుడికి వెళ్లి దేవుడికి మొక్కుతారు. కానీ ఈ మద్య కొంత మంది దొంగలు దేవాలయాలను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పపడుతున్నారు.
ఈ మద్య ఈజీ మనీ కోసం మనిషి దేనికైనా సిద్దపడుతున్నాడు. తక్కువ సమయంలో ఎక్కుడ డబ్బు సంపాదించడానికి ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. మనిషికి ఏ కష్టం వచ్చినా గుడికి వెళ్లి దేవుడికి మొక్కుతారు. కానీ ఈ మద్య కొంత మంది దొంగలు దేవాలయాలను టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పపడుతున్నారు. దేవుడంటే ఏమాత్రం భయం, భక్తి లేని వారు ఇలాంటి దొంగతనాలకు పాల్పపడుతుంటారు. చేసిన పాపం ఊరికే పోదు అన్నట్లు ఓ దొంగ గుడిలో చోరీ చేయడానికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ కుషాయిగూడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ కుషాయిగూడలో వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి మంగళవారం రాత్రి 12 గంటల ప్రాంతంలో ఓ దొంగ గుట్టు చప్పుడు కాకుండా చొరబడ్డాడు. స్వామివారి సన్నిధిలో ఉన్న హుండీ, ప్రతిమను దొంగిలించే ప్రయత్నం చేస్తుండగా శబ్ధం రావడంతో వాచ్ మెన్ రంగయ్య ఆ దొంగను అడ్డుకోబోయాడు. వాచ్‌మెన్ రంగయ్య చూసిన ఆ దొంగ తిరబడి రాళ్లతో దాడి చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మద్య పెనుగులాట జరిగింది.. ఈ క్రమంలో దొంగ కిందపడిపోయి తలకు బలమైన గాయం కావడంతో చనిపోయాడు.
వాచ్ మెన్ రంగయ్య వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వాచ్‌మెన్ రంగయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇక చోరీకి వచ్చిన యువకుడి వద్ద దొరికిన సెల్ ఫోన్ ఆధారంగా కామారెడ్డికి చెందిన గంధం రాజు గా గుర్తించారు. ఇటీవల దొంగలు ఆలయాలను టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పపడుతున్నారని.. సీసీ కెమెరాల ఆధారంగా దుండగులను పట్టుకుంటున్నాని పోలీసులు అంటున్నారు. దేవుడి గుడిలోనే చోరీ చేసిన పాపానికి ఆ భగవంతుడు దొంగకి తగిన శాస్తి చేశారని స్థానికులు అంటున్నారు.