ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. చిన్న చిన్న మనస్పర్థలు మొదలు.. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వైఫల్యం ఇలా రకరకాల కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్న వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. క్షణికావేశంలో వారు తీసుకుంటున్న నిర్ణయాలు.. కుటుంబాల్లో తీరని విషాదం నింపుతున్నాయి. మరికొన్ని సంఘటనల్లో.. కొందరు.. కన్నబిడ్డలపై మమకారాన్ని వదిలేసుకుని.. ప్రాణాలు తీసుకుంటున్నారు. పాపం ఆ చిన్నారుల భవిష్యత్తు ఏంటి.. తాము లేకుండా.. చిన్నారులు ఎలా బతుకుతారు అని ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. ఆత్మహత్య ఆలోచన వచ్చిన వెంటనే.. కొన్ని సెకన్ల పాటు.. తాము మృతి చెందితే.. తమ వారు ఎంత బాధపడతారో.. గుర్తు చేసుకుంటే.. జీవితంలో ఆత్మహత్య ఆలోచన ఎవరు చేయరు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ కూడా కొన్ని నిమిషాల పాటు.. అలా ఆలోచిస్తే.. ఇప్పుడు ఈ విషాదకర సంఘటన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. ఇంతకు ఏం జరిగిందో తెలియాలంటే..
అనారోగ్య సమస్యల కారణంగా.. ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్, కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం కూకట్‌పల్లి మైత్రినగర్‌లో నివాసముంటున్న ప్రకాశం జిల్లా తాండూరుకు చెందిన శివారెడ్డికి.. రాయచూర్‌కు చెందని హులిగమ్మ.. అలియాస్ అనూషతో కొన్నాళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారడంతో.. పెద్దలను ఒప్పించి.. 2018లో వివాహం చేసుకున్నారు. ఇక హులిగమ్మ.. ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తోంది. ఇక శివారెడ్డి.. ఫోటోగ్రాఫర్‌గా పని చేస్తున్నాడు.
ఈ క్రమంలో శనివారం.. శివారెడ్డి.. శుభకార్యం నిమిత్తం.. బయటకు వెళ్లాడు. కొంత సేపటికి.. హులిగమ్మ.. భర్తకు కాల్ చేసి.. ఇంటికి రమ్మని అడిగింది. కానీ అతడు రాలేదు. ఇక ఆదివారం ఉదయం ఇంటికి వచ్చిన శివారెడ్డి.. తలుపు కొట్టగా.. డోర్ తీయలేదు. దాంతో అతడికి అనుమానం వచ్చి.. తలుపు పగలకొట్టి.. లోపలికి వెళ్లి చూడగా.. అక్కడ అనూష.. చున్నీతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించింది. వెంటనే శివారెడ్డి.. పోలీసులకు సమాచారం అందించాడు.
శివారెడ్డి.. ఇచ్చిన సమాచారం మేరకు.. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు.. కేసు నమోదు చేశారు. ఇక శివారెడ్డిని విచారించగా.. హులిగమ్మకు .. ఇప్పటికే మూడు సర్జరీలు జరిగాయని.. అప్పటి నుంచి ఆమె తీవ్రంగా ఇబ్బంది పడుతుందని తెలిపాడు. ఆ బాధ భరించలేకనే.. ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటుంది అని తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్ట్‌మార్టం నిమిత్తం.. హులిగమ్మ మృతదేహాన్ని.. గాంధీ ఆస్పత్రికి తరలించారు. మరి అనూష తీసుకున్న నిర్ణయం సరైందేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.