ఆమెకు అప్పటికే ఓ వ్యక్తితో వివాహం జరిగింది. తాళికట్టిన భర్తతో ఉండలేక చివరికి అతడికి విడాకులు ఇచ్చి దూరం జరిగింది. ఆ తర్వాత ప్రియుడితో కలిసి హైదరాబాద్ కు వచ్చింది. అయితే ఇటీవల ప్రియుడిని నమ్మి ఆ యువతి ఓ రోజు రాత్రి రూమ్ కు వెళ్లింది. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు జ్యోతి. ఆమెకు మూడేళ్ల కిందటే ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అతనితో కొన్ని రోజుల పాటు ఇష్టం ఉండి లేక సంసారం చేసింది. అలా కొన్ని నెలలు గడిచింది. ఆమెకు భర్తతో ఉండడం ఇష్టం లేక పెళ్లైన కొన్నాళ్లకే విడాకులు ఇచ్చింది. దీంతో అప్పటి నుంచి ఆ యువతి తల్లిదండ్రుల వద్ద గడిపింది. ఇకపోతే.. ఆ యువతి ఇటీవల ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ కు పయనమైంది. వచ్చిన కొన్ని రోజులకే నగరంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగానికి కుదిరింది. అక్కడే పని చేస్తూ స్థానికంగా ఓ హాస్టల్ లో నివాసం ఉండేది. షాకింగ్ న్యూస్ ఏంటంటే? ఆమెకు ఇది వరకే ఓ ప్రియుడు ఉన్నాడు. అతడిని నమ్మి ఇటీవల ఓ రోజు రాత్రి రూమ్ కు వెళ్లింది. కట్ చేస్తే.. తెల్లారేసరికి ఊహించని పరిణామం చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పరిధిలోని గొల్లవానితిప్ప గ్రామం. ఇక్కడే పోతుల జ్యోతి (22) అనే యువతి నివాసం ఉండేది. ఆమె తల్లిదండ్రులు మూడేళ్ల కిందట ఓ యువకుడితో వివాహం జరిపించారు. కానీ, పెళ్లైన కొన్నాళ్లకే జ్యోతి భర్తతో ఉండడం ఇష్టం లేక అతనికి విడాకులు ఇచ్చింది. దీంతో అప్పటి నుంచి చాలా కాలం పాటు తల్లిదండ్రుల వద్దే గడిపింది. మరో విషయం ఏంటంటే? తన సొంతూరుకు చెందిన శ్యామ్ (24) అనే యువకుడితో జ్యోతి ప్రేమ వ్యవహారం నడిపినట్లుగా సమాచారం. ఇద్దరు సమీప బంధువులు కావడం విశేషం.
అయితే ఇటీవల జ్యోతి ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్ కు వెళ్లింది. ప్రియురాలు వెళ్లిన కొన్ని రోజులకే శ్యామ్ కూడా నగరానికి వెళ్లాడు. ఇద్దరు వేరు వేరు సంస్థలో ఉద్యోగాలు చేస్తూ హాస్టల్ లో నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. శ్యామ్ స్నేహితుడైన వంశీది త్వరలో నిశ్చితార్థం ఉండడంతో కేపీహెచ్ బీ 7వ ఫేజ్ లో ఉన్న తన ఇంటికి తాళం వేసి ఊరెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న శ్యామ్.. వంశీకి ఫోన్ చేసి అతడి రూమ్ కు వెళ్లాడు. తన వెంట ప్రియురాలు జ్యోతిని కూడా తీసుకెళ్లాడు. అయితే జ్యోతి, శ్యామ్ పెళ్లి చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్నారు. కానీ, పెద్దల కట్టుబాట్ల కారణంగా వీరి పెళ్లి చేసుకోలేదు. బతికుండగా కలిసి ఉండలేమనుకున్నారో ఏమో కానీ.. చివరికి అదే రోజు రాత్రి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారు.
అనుకున్నట్లే ఆ ఇంటి లోపలి నుంచి గడియ పెట్టి శ్యామ్ ఉరి వేసుకోగా, జ్యోతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, హైదరాబాద్ లో ఉంటున్న జ్యోతి సోదరుడు మరుసటి రోజు ఆమెకు ఫోన్ చేశాడు. ఎంతకూ స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చి ఆమె ఉంటున్న హాస్టల్ కు వెళ్లి చూశాడు. అక్కడా కనిపించలేదు. ఇక వెంటనే కేపీహెచ్ బీ 7వ ఫేజ్ లో ఉంటున్న వంశీ ఇంటికి వెళ్లి చూడగా.. గదిలో శ్యామ్, జ్యోతి చనిపోయి విగతజీవులుగా పడి ఉన్నారు. ఈ సీన్ చూసి ఆమె సోదరుడు ఒక్కసారిగా సారిగా షాక్ గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే వీరి ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
మానసిక నిపుణులు అభిప్రాయం:
భర్తతో ఉండలేక జ్యోతి ధైర్యంతో ఒకడుగు ముందుకేసి అతనికి విడాకులు ఇచ్చింది. ఎలాగో తెగించి అడుగు వేసిన జ్యోతి.. తాను కోరుకున్నట్లే ప్రియుడిని పెళ్లి చేసుకోలేదు. ఇదికాకుండా పెద్దల కట్టుబాట్లను కాదనలేక చివరికి ఆత్మహత్య చేసుకుని ఇద్దరు జీవితాలను నాశనం చేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చివరికి జ్యోతి అటు భర్తతో ఉండలేక, ఇటు ప్రియుడితో జీవితాన్ని పంచుకోలేదు. మొత్తానికి అసలు జీవితాన్ని అనుభవించకుండా ఇద్దరు కలిసి చేజేతులా ప్రాణాలు తీసుకోకుండా ఉండాల్సిందని మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటనతో మృతుల స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.