కూతురిని ఓ తల్లి ఎన్నో ఆశలతో పెంచి పెద్ద చేసింది. కానీ, ఓ యువతి తల్లిదండ్రులను కాదని ప్రేమించిన వాడితో లేచిపోయి లవ్ మ్యారేజ్ చేసుకుంది. దీనిని తట్టుకోలేకపోయిన ఆ యువతి తల్లి.. ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
నేటి కాలం యువత తల్లిదండ్రులు కుదిర్చిన పెళ్లిళ్ల కన్న ప్రేమ వివాహాలకే మొగ్గు చూపుతున్నారు. చివరికి తల్లిదండ్రులు అంగీకరించకపోయినా సరే ఎదురించి మరీ లవ్ మ్యారేజ్ లు చేసుకుంటున్నారు. అచ్చం ఇలాగే ఓ యువతి తల్లిదండ్రులను కాదని ప్రియుడితో లేచిపోయి ప్రేమ పెళ్లి చేసుకుంది. ఈ విషయం తెలుసున్న తల్లి ఒక్కసారిగా షాక్ గురైంది. కూతురు మా పరువు తీసిందన్న కారణంతో తల్లి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. తాజాగా హైదరాబాద్ లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
హైదరాబాద్ కూకట్ పల్లిలోని జయానగర్ కాలనీలో గోనుగుంట శ్రీనివాస్-నిర్మల దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ కూతురు, కుమారుడు సంతానం. భర్త ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండగా భార్య ఇంటి వద్దే ఉండేది. ఇక వీరి కుమార్తె నగరంలోని ఓ కాలేజీలో చదువుకునేది. అయితే ఆ అమ్మాయి చదువుకునే క్రమంలోనే తన క్లాస్ మెట్ ని ప్రేమించింది. ఇక రాను రాను వీళ్లిద్దరూ మరింత దగ్గరై ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా తయారయ్యారు. ఇక ఎలాగైన పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.
అనుకున్నదే ఆలస్యం.. ఇందు కోసం పక్కా ప్లాన్ తో ఈ నెల 17న ఇద్దరూ లేచిపోయి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న తల్లి నిర్మల.. ఒక్కసారిగా షాక్ గురైంది. ఇదే విషయమై భార్యాభర్తలు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఉన్నట్టుండి కూతురు ఇంత పని చేయడంతో తల్లి తట్టుకోలేకపోయింది. కూతురు చేసిన పనికి మా పరువు పోయిందనుకున్న తల్లి నిర్మల.. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇక కొద్ది సేపటి తర్వాత ఆమె భర్త శ్రీనివాస్ ఇంట్లోకి వచ్చి చూడగా.. భార్య ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది.
ఈ సీన్ చూసిన శ్రీనివాస్, అతని కొడుకు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కూతురు లవ్ మ్యారేజ్ చేసుకుందని తల్లి ఆత్మహత్య చేసుకున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.