కోపం మనిషిని మృగంలా మారుస్తుంది. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల తమ జీవితాలనే కాక.. తమ మీద ఆధారపడ్డ వారిని జీవితాలను కూడా నాశనం చేస్తారు. ఆ కాసేపు.. శాంతంగా ఉన్న వ్యక్తి.. జీవితం పూలబాట అవుతుంది. లేదంటే దారుణాలు చోటు చేసుకుంటాయి. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
ఆత్మహత్య.. అసలు మనిషికి చనిపోవడానికి ఉన్న ధైర్యంలో ఒక్క శాతం నిజ జీవితంలో చూపినా.. నిండు నూరేళ్లు సంతోషంగా బతకవచ్చు అంటారు. ఈ మాట ఎంత వరకు సత్యమో తెలియదు కానీ.. నేటి కాలంలో చాలా మంది మరీ ముఖ్యంగా యువత, మైనర్లు.. బతకడానికి భయపడి.. చావే శరణ్యం అనుకుంటున్నారు. ఆత్మహత్యే సుఖమని భావిస్తున్నారు. చిన్న చిన్న విషయాలకు కూడా అమితంగా భయపడి.. ప్రాణాలు తీసుకుంటున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని ప్రారంభంలోనే ముగిస్తున్నారు. తాజాగా ఓ దారుణం వెలుగు చూసింది. ఆవేశంలో ఓ మహిళ.. తీసుకున్న నిర్ణయం.. నెలల పసివాడిని అనాథగా మిగిల్చింది. పాలు తాగే బుజ్జాయి.. ఆకలేస్తే అమ్మ కనిపించక.. నిద్ర వస్తే వెచ్చగా పడుకునే అమ్మ ఒడి దూరమయ్యి.. గుక్క పట్టి ఏడుస్తున్నాడు. ఆ పసివాడి బాధ చూసి.. ప్రతి ఒక్కరు కంట తడి పెడుతున్నారు. ఇంత దారుణం ఎలా చేయగలిగావ్ తల్లి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ వివరాలు..
భార్యాభర్తలు ఇద్దరు గొడవపడ్డారు. ఆ కోపంలో.. మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఎనిమిది నెలల చిన్నారి తల్లిలేని బిడ్డ అయ్యాడు. ఈ విషాదకర సంఘటన హైదరాబాద్, కేపీహెచ్‌బీకాలనీలో చోటు చేసుకుంది. ఆ వివరాలు.. విజయవాడకు చెందిన సాత్విక ఓ ప్రైవేట్ బ్యాంక్‌లో పని చేస్తోంది. ఆమెకు విజయవాడకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హరీష్‌తో రెండేళ్ల క్రితం వివాహం అయ్యింది. ప్రస్తుతం వీరి రెండు కుటుంబాలు నగరంలోనే ఉంటుండగా.. హరీష్-సాత్విక దంపతులు కేపీహెచ్‌బీ ఒకటో రోడ్డు ట్రినిటీ చర్చి సమీపంలో నివాసం ఉంటున్నారు. వీరికి ఎనిమిది నెలల బాబు ఉన్నాడు. అయితే గత కొంతకాలంగా హరీష్, సాత్వికల మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం అనగా ఏప్రిల్ 6న భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. రాత్రి 10 గంటల సమయంలో దంపతులు ఇద్దరు గొడవపడ్డారు. ఆవేశంతో గదిలోకి వెళ్లిన సాత్విక.. ఫ్యాన్‌కు ఉరేసుకుని.. ఆత్మహత్య చేసుకుంది. కాసేపటికి హరీష్ వచ్చి తలుపు కొట్టగా ఎంతకు తీయలేదు. దాంతో అతడు తలుపు బద్దలు కొట్టి.. లోపలకు వెళ్లి చూడగా.. ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది సాత్విక. వెంటనే అతడు తన తల్లిదండ్రులు, అత్తమామలకు, పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘనా స్థలానికి చేరుకున్న పోలీసులు సాత్విక మృతదేహాన్ని పోస్టుమార్ట నిమిత్తం.. గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు హరీశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరి సాత్విక తీసుకున్న నిర్ణయం సరైందేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.