పైన కనిపిస్తున్న వివాహిత పేరు అబ్బాసి. హైదరాబాద్ లోని హుమాయూన్ నగర్ లో నివాసం ఉండేది. ఈమెకు గత 9 నెలల కిందటే ఓ యువకుడితో వివాహం జరిగింది. పెళ్లైన కొన్ని నెలలకే భర్త ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లాడు. కట్ చేస్తే తాజాగా ఆ నవ వధువు బెడ్ రూంలో ఊహించని స్థితిలో కనిపించింది. ఈ సీన్ చూసిన అత్తమామలు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అసలేం జరిగిందంటే?
ఆమెకు పెళ్లై 9 నెలలు అయింది. భర్త ఉద్యోగం నిమిత్తం ఆస్ట్రేలియాకు వెళ్లాడు. దీంతో అప్పటి నుంచి ఆ మహిళ అప్పుడప్పుడు పుట్టింటికి వెళ్తూ అత్తింటికి వస్తుండేది. అలా కొన్ని రోజులు గడిచింది. ఇక భర్తకు దూరంగా ఉండడంతో ఆ మహిళ కాస్త ఇబ్బందిగానే ఫీల్ అయింది. అయినా సరే తప్పదు అన్నట్లుగా అక్కడే కొన్నాళ్లు ఉంది. అయితే ఉన్నట్టుండి ఆ మహిళ బెడ్ రూంలో ఊహించని స్థితిలో కనిపించింది. ఈ సీన్ చూసిన అత్తమామలు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ హుమాయూన్ నగర్ పరిధిలోని ఆసిఫ్ నగర్ ప్రాంతం. ఇక్కడే అఫ్రోజ్ (24) అనే యువకుడు నివాసం ఉండేవాడు. అయితే ఇతనికి టోలీచౌకీ ప్రాంతానికి చెందిన మహమ్మద్ గౌస్ అబ్బాసి (21) అనే యువతి 9 నెలల కిందట వివాహం జరిగింది. ఇక పెళ్లి సమయంలో ఆ యువతి తల్లిదండ్రులు అఫ్రోజ్ కు కట్నకానుకలు బాగానే ముట్టజెప్పారు. ఇదిలా ఉంటే ఉద్యోగం నిమిత్తం అఫ్రోజ్ గత రెండు నెలల కిందటే ఆస్ట్రేలియాకు వెళ్లాడు. దీంతో అప్పటి నుంచి ఆ యువతి అత్తింట్లోనే ఉండేది. ఇక అప్పుడప్పుడు పుట్టింటికి కూడా వెళ్లి వస్తుండేది.
ఇదిలా ఉంటే పెళ్లైన కొత్తలోనే భర్త ఆస్ట్రేలియాకు వెళ్లడంతో ఆ వివాహిత కాస్త దిగులుగా ఉండేది. ఇకపోతే.. గత కొన్ని రోజుల నుంచి అత్తింటివాళ్లు ఆ మహిళను అదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు గురి చేసినట్లుగా తెలుస్తుంది. అయితే రాను రాను అత్తింటి వేధింపులు ఎక్కువవ్వడంతో ఆ వివాహిత తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసిన ఆ మహిళ.. బెడ్ రూంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ సీన్ చూసిన అత్తమామలు ఒక్కసారిగా షాక్ గురయ్యారు.
ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. కూతురిని ఆ స్థితిలో చూసి ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మా కూతురిని అత్తింటివాళ్లే అదనపు కట్నం తేవాలంటూ వేధింపులకు గురి చేశారని, దీని కారణంగానే మా అమ్మాయి ఆత్మహత్యకు పాల్పడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లైన 9 నెలలకే కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ వివాహిత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లైన కొన్ని నెలల ముందే నవ ఆత్మహత్య చేసుకున్న ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.