ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు బాగా పెరిగిపోయాయి. చిన్న చిన్న సమస్యలకు కూడా కొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రాణాలు తీసుకుంటున్న వారిలో చిన్న పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారు ఉంటున్నారు. తాజాగా, ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. అది కూడా పుట్టిన రోజు నాడే ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకుని ఉసురు తీసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్‌లో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల మేరకు.. హర్షిత అనే 20 ఏళ్ల యువతి నగరంలోని కూకట్‌పల్లి, బాలాజీ నగర్‌లో ఉంటోంది. గురువారం ఆమె పుట్టిన రోజు. సాధారణంగా పుట్టిన రోజు నాడు అందరూ సంతోషంగా ఉంటారు. ఓ వేడుకలా పుట్టిన రోజును జరుపుకుని సంతోషపడతారు.
అయితే, హర్షిత మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించింది. ఏ కష్టం వచ్చిందో ఏమో తెలీదు కానీ, ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుంది. పుట్టిన రోజు నాడే తన గదిలోకి వెళ్లింది. అక్కడి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హర్షిత మృతదేహాన్ని కిందకు దించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు హర్షిత ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? పుట్టిన రోజు నాడే ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. మరి, పుట్టిన రోజు నాడే ప్రాణాలు తీసుకున్న హర్షిత విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.