అభం శుభం తెలియని చిన్నారిని.. కన్న తల్లిదండ్రులే ఉరి వేశారు. ఆ తర్వాత వాళ్ల కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారితో పాటు కుటుంబంలో పెద్దమనిషిగా ఉన్న మరో మహిళకు ఉరేసేకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే సారి కుటుంబంలోని నలుగురు సమూహిక ఆత్మహత్య చేసుకున్న ఈ హృదయవిదారకమైన ఈ ఘటన.. హైదరాబాద్‌లోని హబ్సిగూడలో చోటు చేసుకుంది. హబ్సిగూడలోని ఒక అపార్టుమెంట్‌లో నివాసముంటున్న ప్రతాప్(34), సింధూర(32) దంపతులు.. సోమవారం ఆత్మహ్యతకు పాల్పడ్డారు.
వారు ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తమ నాలుగేళ్ల చిన్నారికి గుండెరాయి చేసుకుని ఉరివేశారు. అనంతరం వారిద్దరు.. వాళ్లతో పాటు ప్రతాప్ తల్లి కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే ఇంట్లో నలుగురు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలు.. చెన్నైలోని ఓ కారు షోరూమ్‌లో డిజైనర్ మేనేజర్‌గా ప్రతాప్ పనిస్తున్నారు. ఆయన భార్య సింధూర హిమయత్‌నగర్‌లోని ఓ ప్రవేట్ బ్యాంక్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. అయితే.. కుటుంబ కలహాలతోనే వారు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రతాప్ కుటుంబం మొత్తం ఆదివారం బయటకు కూడా వెళ్లి వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు. అయితే.. సోమవారం సింధూర కోసం బ్యాంకు సిబ్బంది వచ్చి.. తలుపు కొట్టగా.. ఎంతకీ తీయకపోవడంతో.. వారు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. పోలీసులు వచ్చిన తలుపుతు తెరవగా.. నలుగురు ఇంట్లో విగతజీవులుగా కన్పించారు. చిన్నారికి ఉరేసిన తర్వాత వారు ముగ్గురు కూడా ఉరేసుకున్నట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు. కాగా ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.