Crime News : వరకట్న వేధింపులు భరించలేక ఓ మహిళ తన బిడ్డతో పాటు ప్రాణాలు తీసుకుంది. భవనంపైనుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో బాలుడు మృతి చెందగా.. తల్లి తీవ్ర గాయాలపాలైంది. ఈ సంఘటన సోమవారం హైదరాబాద్‌లోని చిలకలగూడలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మెట్టుగూడకు చెందిన తప్పెట మహేందర్‌కు 2018లో మల్కాజిగిరి సఫిల్‌గూడకు చెందిన దివ్యతేజతో పెళ్లయింది. వీరికి 2021 మార్చి 3న ఓ రిత్విక్ పుట్టాడు. దివ్యతేజను భర్తతో పాటు ఇతర కుటుంబసభ్యులు అదనపు కట్నం కావాలని ఒత్తిడి తెస్తున్నారు. పుట్టింటి నుంచి డబ్బు తేవాలంటూ వేధింపులకు గురిచేస్తున్నారు. భర్త, అత్తింటి వారి వేధింపులు భరించలేకపోయిన ఆమె చనిపోవాలనుకుంది.
తాను ఒక్కత్తే చనిపోతే బిడ్డను అత్తింటివారు సరిగా చూసుకోరని భావించి తనతో పాటు అతడ్ని కూడా తీసుకెళ్లింది. సోమవారం ఉదయం ఇంటికి ఎదురుగా ఉన్న నాలుగు అంతస్తుల భవనంపైకి ఎక్కింది. బాబుకు శానిటైజర్ తాగించి, తాను కూడా తాగింది. కుమారుని చేతి మణికట్టు కోసి, తాను కూడా కోసుకుంది. అనంతరం అక్కడినుంచి బాబుతో సహా కిందకు దూకింది. రోడ్డుపై పడ్డ చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. వాహనంపై పడ్డ దివ్యతేజకు తీవ్రగాయాలయ్యాయి. బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహేందర్ కుటుంబసభ్యుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఫేర్‌వెల్ పార్టీ.. ‘‘నన్ను మోసం చేశావ్!’’ అంటూ బాలికపై..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.