హైదరాబాద్ ముషీరాబాద్ ప్రాంతంలోని రిసాలగడ్డ డ్రింకింగ్ వాటర్ ట్యాంక్‌లో కుళ్లిన స్టేజలో ఓ డెడ్ బాడీ గుర్తించిన విషయం తెలిసిందే. ఈ విషయం అక్కడి వారిని ఉలిక్కి పడేలా చేసింది. ఆ శవం నీళ్లలో దాదాపు 40-50 రోజుల క్రితమే పడి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే స్థానికులు గత కొద్ది రోజులుగా డెడ్ బాడీ కుళ్లుతున్న నీటిని తాగుతున్నారు. నగరం నడిబొడ్డున ముషీరాబాద్ పరిధినిలోని వారికి ఈ వాటర్ ట్యాంక్ నీరే మంచి నీరు తాగుతున్నారు. శివస్థాన్ పూర్, ఎస్ఆర్కె నగర్, పద్మశాలి సంఘం, హరినగర్ కాలనీలకు ఈ ట్యాంకర్ నుంచే డ్రింకింగ్ వాటర్ సప్లై జరుగుతుంది.
ఎస్ ఆర్ కె కాలనీ నీటి వసతి కొరకు సొసైటీకి చెందిన 600 గజాల స్థలాన్ని వాటర్ ట్యాంక్ నిర్మాణానికి కేటాయించారు. చాలా ఏళ్ల క్రితం నిర్మించిన ఈ వాటర్ ట్యాంక్ పూర్తిగా మెయింటెన్ లేకపోవడంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని స్థానికులు తెలిపారు. అయితే.. దాదాపు నెలన్నరపైనే ఆ శవం ఆ నీటిలో నానుతోందని, ఆ నీటినే తాము తాగినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కొద్ది రోజుల క్రితం వెంట్రుకలు బాగా నానిన చిన్న చిన్న మాంసపు ముక్కలు మంచినీళ్లలో వచ్చాయని బస్తీ వాసులు చెప్పినట్లుగా సమాచారం. ఈ ఘటనతో మొత్తం రాష్ట్రం ఉలిక్కి పడగా.. పోలీసుల విచారణ వేగవంత అయ్యింది. దీంతో.., ముషీరాబాద్ వాటర్ ట్యాంక్‌లో లభ్యమైన డెడ్ బాడీ ఎవరిది అన్నదానిపై సస్పెన్స్ గంటల వ్యవధిలోనే వీడింది. మృతుడు అంబేడ్కర్ నగర్‌లో నివాసం ఉంటున్న కిషోర్‌గా పోలీసులు గుర్తించారు. ట్యాంకుపైన ఉన్నమృతుడి చెప్పులను అతని అక్క గుర్తించారు.
కిషోర్ పెయింటింగ్ వర్కర్ గా జీవిస్తూ ఉండేవాడు. కానీ.., మద్యానికి బానిసైన కిషోర్ చెడు మార్గం పట్టాడు. ఇంటికి కూడా ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వస్తుండే వాడని తెలుస్తోంది. చాలా కాలంగా కిషోర్ ఇంటికి రాకపోవడంతో కిషోర్ అక్క తన తమ్ముడు మిస్ అయినట్టు 15 రోజుల క్రితం నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ కూడా ఇచ్చింది. ఈ కేసు ఆధారంగానే ఇప్పుడు ఈ డెడ్ బాడీ కిషోర్ దని గుర్తించారు. అయితే.. కిషోర్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. మరి.. ఒక డెడ్ బాడీ ఒకటిన్నర నెలగా వాటర్ ట్యాంక్ లో ఉంటే.. అస్సలు గుర్తించలేకపోయిన అధికారుల నిర్లక్ష్యంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.