ఎంటర్ ప్రైజెస్ యూట్యూబర్ గా పని చేస్తున్న ఓ యువకుడు.. పెళ్లైన మహిళను ప్రేమిస్తున్నాని నమ్మించాడు. ఇక ఆమెతో శారీరకంగా కలిసి బాగానే ఎంజాయ్ చేశాడు. కట్ చేస్తే.. ఇతగాడు ఇచ్చిన షాక్ కి ఆ మహిళ కోలుకోలేక నోరెళ్లబెట్టింది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
దేశంలో రోజుకు ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. మైనర్ బాలికలపై అత్యాచారాలు, ప్రేమిస్తున్నానని నటించి మోసం చేయడం.. ఇలా ఒకటేంటి.. రోజూ మనం ఎన్నో రకాల దారుణాలను చూస్తున్నాం. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లో ఎంటర్ ప్రైజెస్ యూట్యూబర్ గా పని చేస్తున్న ఓ యువకుడు.. ఏకంగా పెళ్లైన మహిళను ప్రేమిస్తున్నాని నమ్మించాడు. ఇక ఆమెతో శారీరకంగా కలిసి బాగానే ఎంజాయ్ చేశాడు. కట్ చేస్తే.. ఇతగాడు ఇచ్చిన షాక్ కి ఆ మహిళ కోలుకోలేక నోరెళ్లబెట్టింది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ మెహదీపట్నంలోని సంతోష్ నగర్ ప్రాంతం. ఇక్కడే మహ్మద్ బిన్ ఇషాక్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. గతంలో ఇతగాడు ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇంతటితో సరిపెట్టలేదు. విషయం ఏంటంటే? గత అక్టోబర్ నెలలో ఆ యువకుడికి బంజారాహిల్స్ రోడ్ నెం. 12 మిథిలానగర్ లో నివాసం ఉంటున్న ఓ వివాహిత (32) పరిచయం అయింది. ఈ పరిచయంతోనే ఇద్దరూ కాస్త దగ్గరయ్యారు.
ఈ క్రమంలోనే మహ్మద్ బిన్ ఆ వివాహితో.. నాకు ఇంకా పెళ్లి కాలేదని, నిన్ను ప్రేమిస్తున్నానని, నిన్నే పెళ్లి చేసుకుంటానని నమ్మించినట్లు తెలుస్తుంది. దీంతో ఆ మహిళ నిజంగానే అతడి మాటలు నమ్మి అతడికి అన్ని రకాలు దగ్గరైందట. అలా కొన్ని రోజుల పాటు మహ్మద్ బిన్ ఆ వివాహిత నమ్మించి ఆమెతో సహజీవనం చేస్తూ వచ్చాడు. ఇక తొందర్లనే మనం ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నామని ఆ వివాహితతో చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే మహ్మద్ బిన్ గురించి ఇటీవల ఆ వివాహితకు నమ్మలేని నిజాలు తెలిశాయి.
అయితే ఇదే విషయం గురించి ఆ వివాహిత మహ్మద్ బిన్ ను అనేక సార్లు ప్రశ్నించింది. కానీ, ఆ యువకుడు మాత్రం ఎలాంటి సమాధానం చెప్పకుండా దాటవేస్తూ వచ్చాడు. ఇక మొత్తానికి నేను మోసపోయానని గ్రహించిన ఆ మహిళ.. ఈ నెల 13న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు అతడిని అరెస్ట్ చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. మూడు పెళ్లిళ్ల విషయం దాచి ఓ వివాహితను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన ఇతగాడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.