అప్పటి వరకు పుట్టింట్లో.. తల్లిదండ్రులు, తోబుట్టువుల ప్రేమానారాగాల మధ్య.. ఎంతో గారాబంగా పెరిగిన ఆడపిల్ల.. పెళ్లి చేసుకుని.. అత్తారింటికి వెళ్లిన తర్వాత.. పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. కొత్త మనుషులు.. కొత్త మనస్తత్వాలు.. అంత త్వరగా అడ్జెస్ట్ కాలేరు. కొంత మంది.. కోడలిని కూతురులా భావించి.. ఆమెను ప్రేమగా చూసుకుని.. కొత్తిల్లు.. అనే భావం పొగొడతారు. కానీ చాలా మంది విషయంలో మాత్రం ఇలా జరగదు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే మహిళ.. అత్తారింట్లో మంచి కోడలిగా బంధువుల చేత ప్రశంసలు పొందింది. కూతురు కాపురం చూసి తల్లిదండ్రులు ఎంతో మురిసిపోయారు. కానీ ఇంతలో.. అనుకోని విషాదం చోటు చేసుకుంది. ఒక్క ఫోన్ కాల్ ఆ మహిళ జీవితాన్ని మార్చేసింది. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఇది చదవండి..
హైదరాబాద్ రాజేంద్రనగర్‌కు చెందిన పుష్పాంజలి.. అనే మహిళకు.. ఎనిమిది నెలల క్రితం.. అత్తాపూర్‌కు చెందిన కిరణ్ కుమార్‌తో వివాహం జరిగింది. కిరణ్ తల్లి చనిపోయింది.. తండ్రి అనారోగ్యం కారణంతో ఇంట్లోనే ఉండేవారు. పెళ్లైన తర్వాత అత్తారింటికి వెళ్లిన పుష్పాంజలి.. అక్కడి పరిస్థితులకు తగ్గట్టుగా తనను తాను మార్చుకుంది. కొద్ది కాలంలోనే.. బంధువులందరి చేత.. మంచి కోడలిగా పేరు తెచ్చుకుంది. కుమార్తె కాపురం చూసి తల్లిదండ్రులు.. ఎంతో సంతోషించారు. అయితే వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు. పెళ్లైన 8 నెలలకే పుష్పాంజలి.. అత్తారింట్లో ఆత్మహత్య చేసుకుంది. అందరితో చక్కగా కలిసిపోయి.. మంచి మనిషిగా పేరు తెచ్చుకున్న పుష్పాంజలి.. ఇంత దారుణ నిర్ణయం ఎందుకు తీసుకుందో ఎవరికి అర్థం కాలేదు.
పుష్పాంజలి భర్త.. సోమవారం ఉదయం.. ఎప్పటిలానే డ్యూటీకి వెళ్లాడు. అతడు ఆఫీస్‌కు వెళ్లగానే.. ఆమె ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వెంటనే ఈ విషయాన్ని భర్తకు తెలియజేయడంతో.. అతడు వచ్చి.. డోర్‌ను బద్దలు కొట్టి.. లోనికి వెళ్లి చూడగా.. పుష్పాంజలి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. దాంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి.. డెడ్‌బాడీని పోస్ట్‌మార్టమ్‌కు తరలించారు.
ఇక పోలీసుల దర్యాప్తులో భాగంగా.. ఆదివారం రాత్రి పది గంటలకు పుష్పాంజలి.. తన సోదరికి కాల్ చేసి.. అర్జెంట్‌గా రమ్మని కోరినట్లు తెలిసింది. సోదరిని చూడాలని.. మాట్లాడాలని ఉందని చెప్పింది. తెల్లవారగానే ఈ దారుణం చోట చేసుకుంది. దాంతో పోలీసులు.. పుష్పాంజలి తన సోదరికి ఏం చెప్పాలనుకుంది.. కొత్త కాపురంలో ఏవైనా గొడవలు ఉన్నాయా.. వరకట్న వేధింపులు చోటు చేసుకున్నాయా వంటి కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరి పెళ్లై పట్టుమని ఏడాది కూడా గడవకముందే.. పుష్పాంజలి ఇలాంటి దారుణం నిర్ణయం తీసుకోవడం వెనక ఏమైనా కారణాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.