ఈ మధ్యకాలంలో కొంతమంది యువతి, యువకులు ప్రతీ చిన్న విషయాలకు కూడా ఆత్మహత్యలకు పాల్పడుతూ కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చి వెళ్లిపోతున్నారు. అచ్చం ఇలాగే తాజాగా హైదరాబాద్ లో మరో యువతి ఆత్మహత్య చేసుకుంది.
అమీర్ పేట్ లో ప్రైవేట్ హాస్టల్ లో ఉంటున్న ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న హాస్టల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత పోలీసులు ఇదే విషయాన్ని మృతురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అసలు ఆ యువతి ఎవరు? ఎందుకు ఆత్మహత్య చేసుకుందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతి (18) హైదరాబాద్ లోని ఓ సంస్థలో టెలీకాలర్ గా పని చేస్తూ అమీర్ పేట్ లో ఓ ప్రైవేట్ హాస్టల్ లో ఉంటుంది. అయితే ఈ యువతి తన గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా అతడినే పెళ్లి చేసుకోవాలని కూడా అనుకుంది. ఇదే విషయాన్ని ఇటీవల తన తల్లిదండ్రులకు వివరించింది. దీనికి ఆమె కుటుంబ సభ్యులు నిరాకరించడంతో పాటు యువతిని మందలించారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆ యువతి తన ఇంటికి వెళ్లింది. కూతురితో తల్లిదండ్రులతో పాటు ఇంట్లో వాళ్లూ ఎవరూ కూడా పన్నెత్తి ఓ మాట మాట్లాడలేదని తెలుస్తుంది.
దీంతో ఆ యువతి తీవ్ర మనస్థానికి గురై వెంటనే నేరుగా హైదరాబాద్ వెళ్లింది. ఇక తాను ఉంటున్న హాస్టల్ లోని తన గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో హాస్టల్ సిబ్బంది స్పందించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఇదే విషయాన్ని మృతురాలి తల్లిదండ్రులకు తెలియజేసి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కూతురు మరణవార్త తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ప్రియుడితో పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించలేదని ఆత్మహత్య చేసుకున్న యువతి ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.