భార్యాభర్తల వివాహ జీవితంలో ఎన్నో అనుభూతుల మధ్య వివాహేతర సంబంధాలతో పచ్చని సంసారాలు బుగ్గిపాలవుతున్నాయి. ఇలా కొంతమంది పెళ్లైన భార్యభర్తలు వివాహేతర సంబంధాల్లో తలదూర్చుతున్నారు. భర్తను కాకుండా భార్య, భార్యను కాకుండా భార్య ఇలా తెర వెనుక కుంపటిలో వేలు పెట్టి ఎటు కాకుండా పోతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. యూపీలోని మురాదాబాద్ జిల్లా మఝోలా ప్రాంతంలో పెళ్లైన భార్యాభర్తలు సంసారాన్ని కొనసాగిస్తున్నారు. ఇలా కొన్నాళ్లు గడిచి వీరికి ఓ కూతురు కూడా జన్మించింది.
అయితే ఇది వరకే ఆ వివాహితకు లవర్ ఉన్నాడు. ఇది బయటకు రాకుండా ఆ వివాహిత ఇన్నాళ్లు మెయింటెన్ చేస్తూ వచ్చింది. ఈ మధ్యకాలంలో భార్య తరుచూ ప్రియుడితో ఫోన్ లో బిజీగా మాట్లాడుతుండటం భర్త చూశాడు. దీంతో అనుమానంతో పలుమార్లు హెచ్చరించే ప్రయత్నం చేశాడు. కానీ భార్య వక్రబుద్ది మాత్రం అస్సలు మారలేదు. ఇక విసుగుపోయిన భర్త ఎవరని ప్రశ్నించేసరికి భార్య అసలు విషయాన్ని బయటపెట్టింది. దీంతో భర్త ఏకంగా భార్యను ప్రియుడు వద్దకు పంపేందుకు నిర్ణయం తీసుకున్నాడు.
తన కూతురిని కాదని భార్య ప్రియుడి వద్దకు వెళ్లేందుకు నిర్ణయం తీసుకుంది. కొన్నాళ్ల పాటు భర్తను, కూతురిని కాదని ప్రియుడితో దూరంగా ఉంంటుంది. అయితే కొంతకాలానికి ఆ మహిళ తన భర్తకు ఫోన్ చేసి మాట్లాడుతుంటే ప్రియుడు చూశాడు. ఏంటని ప్రశ్నిస్తే.. నాకు నా భర్త కూతురు గుర్తుకొస్తున్నారంటూ బాధతో సమాధానం చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య కాస్త వివాదం చెలరేగి పోలీసుల వరకూ వెళ్లింది. పోలీసుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం ప్రియుడితో ఉండేందుకు ఆ మహిళ మొగ్గుచూపింది. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.