భార్య బట్టలు విప్పి నగ్నంగా ఊరేగించిన భర్త.. వీడియో వైరల్ అవ్వడంతో..

భార్య బట్టలు విప్పి నగ్నంగా ఊరేగించాడో భర్త. అది చూసిన జనం ఆనందిస్తున్నారే తప్ప తప్పు అని ఒక్కరు కూడా అనడం లేదు. అంతలా భార్య బట్టలు విప్పి ఊరేగించడానికి కారణం ఏంటి?

  • Written By:
  • Publish Date - June 2, 2023 / 09:02 PM IST

భార్య, భర్తల మధ్య సవాలక్ష గొడవలు ఉంటాయి. అయితే ఎన్ని ఉన్నా నాలుగు గోడల మధ్య తేల్చుకోవాలి గానీ నడిరోడ్డు మీద పెట్టుకుంటే కుటుంబ గౌరవ, మర్యాదలు బజారున పడతాయి. ఒక వ్యక్తి తన భార్య బట్టలు విప్పి ఆమెను నగ్నంగా ఊరంతా ఊరేగించాడు. గ్రామస్తులు చూస్తుండగానే ఆమెను నగ్నంగా ఊరేగించాడు. ఇతనికి మరో ముగ్గురు కానీ కానీ అంటూ ప్రోత్సహించారు. గ్రామస్తులు చూస్తుండగానే తన భార్యను కొట్టి చిత్రహింసలు పెట్టాడు. దీన్ని ఒక వ్యక్తి మొబైల్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో ఘటన వెలుగులోకి వచ్చింది. అంతలా భార్యను నగ్నంగా ఊరంతా ఊరేగించడానికి కారణం ఏంటి? అసలు ఆమె చేసిన తప్పు ఏంటి? క్షమించరాని తప్పు చేస్తే మాత్రం ఊరంతా చూస్తుండగా బట్టలు విప్పి ఊరేగిస్తారా?

గుజరాత్ లోని దాహోద్ జిల్లాలోని ఓ గిరిజన మహిళకు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈమెకు నలుగురు పిల్లలు జన్మించారు. ఏడాదిన్నర క్రితం భర్తను, పిల్లలను వదిలేసి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. మెహ్సానా జిల్లాలోని చనస్మా గ్రామంలో వేరే వ్యక్తితో కలిసి సహజీవనం కొనసాగిస్తోంది. ఈ ఇద్దరూ రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు. అయితే భార్య తమను వదిలి వెళ్లిపోవడంతో మొదటి భర్త ఆమెపై పగ పెంచుకున్నాడు. రెండో భర్త గ్రామమైన రాంపురాలో బంధువుల వివాహం ఉంటే అతని తల్లి కొడుకుని, కోడలిని ఆహ్వానించింది. ఆ మహిళ రెండో భర్తతో కలిసి పెళ్ళికి వెళ్ళింది. ఈమె మొదటి భర్తను కూడా రెండో భర్త తల్లి పెళ్ళికి పిలిచింది. దీంతో మొదటి భర్త, రెండో భర్త, భార్య ముగ్గురూ ఒక చోట కలుసుకున్నారు.

అయితే మొదటి భర్త తన భార్యను కిడ్నాప్ చేసి కారులో మర్గల గ్రామానికి తీసుకెళ్లాడు. అక్కడ అందరి ముందు భార్య బట్టలు విప్పి దారుణంగా కొట్టి చిత్రహింసలు పెట్టాడు. అంతటితో ఆగకుండా ఆమెను గ్రామస్తులు చూస్తుండగా నగ్నంగా ఊరేగించాడు. ఇలా చేయవద్దు అని చెప్పడం మానేసి అతనికి మరో ముగ్గురు వత్తాసు పలికారు. ఈ మొత్తం దృశ్యాలను ఒకతను తన మొబైల్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో వీడియో కాస్తా వైరల్ అయ్యింది. పోలీసుల వరకూ వెళ్లడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆమె భర్తతో పాటు అతనికి సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన మే 28న చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed