భార్యాభర్తల వైవాహిక జీవితంలో వివాహేతర సంబంధాలు పచ్చని జీవితాలను నాశనం చేస్తున్నాయి. ఇలా ఇలాంటి కార్యక్రమాల్లో అడుగు పెట్టి చివరికి హత్యలు, ఆత్మహత్యలకు దిగుతున్నారు. కొంతమంది భర్తలు భార్యలపై అనుమానం పెంచుకుని చివరికి చంపే స్థాయికి చేరుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.
ఇక విషయం ఏంటంటే..? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా శివాజీనగర్ ప్రాంతం. లోకేష్, గాయిత్రి ఇద్దరు భార్యాభర్తలు. పెళ్లై తొమ్మిది ఏళ్లు గడిచాయి. వీరికి ఎనిమిదేళ్ల కుమార్తె కూడా ఉంది. భర్త ఇంటింటికి వాటర్ సప్లై చేస్తుండగా.. భార్య ఓ ప్రయివేట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తుంది. దీంతో వీరి దాంపత్య జీవితం కొన్నాళ్లు హాయిగా సాగిపోతు ఉంది. అయితే ఈ మధ్య కాలంలోనే గాయత్రి స్థానికంగా ఓ యువకుడితో సన్నిహితంగా మెలుగుతున్నట్లు భర్త లోకేష్ కు కాస్త అనుమానం కలిగింది.
ఇటీవల ఓ రోజు భర్త లోకేష్ ఇంటికి రాగానే భార్య అదే యువకుడితో మాట్లాడుతూ కనిపించింది. దీంతో ఒక్కసారిగా భర్త లోకేష్ కోపం కట్టలు తెంచుకుంది. ఇదే విషయమై భార్యాభర్తల మధ్య వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇదే క్రమంలో కోపంతో రగిలిపోయిన భర్త భార్యపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో భార్య గాయత్రి రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే మరణించింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.