తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పథకం దళిత బంధు. దళితుల సాధికారత కోసం ఒక్కో దళిత కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఇస్తుంది. అయితే ఈ దళిత బంధు పథకాన్ని ఏ దళిత కుటుంబానికి ఇవ్వాలో తెలియక స్థానిక లీడర్లు తలలు పట్టుకుంటున్నారు. తమకు అనుకూలంగా ఉన్న వారికి ఈ పథకాన్ని ఇస్తూ గొడవలు సృష్టిస్తున్నారు. గత కొంత కాలం నుంచి దళిత బంధు కోసం గ్రామాల్లో గొడవలు కూడా జరుగుతున్నాయి. అయితే దళిత బంధు ఆశ చూపి స్థానిక నాయకులు వేధింపులకు కూడా పాల్పడుతున్నారు. ఇదిలా ఉంటే దళిత బంధు కోసం ఓ భర్త నీచానికి పాల్పడ్డాడు. కాసుల కోసం కట్టుకున్న పెళ్లాం అని చూడకుండా ఊహించని దారుణానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు మీ కోసం.
మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ కు చెందిన ఓ వివాహితకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొంత కాలానికి ఆ మహిళ భర్త మరణించాడు. దీంతో కొన్నాళ్ల నుంచి ఒంటరి జీవితాన్ని గడిపింది. ఇక కొంత కాలం తర్వాత హాజీపూర్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన రామగిరి సురేష్ అనే వ్యక్తిని ఆ మహిళ వివాహం చేసుకుంది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల సంసారం బాగానే సాగింది. అలా వీరి కాపురం సంతోషంగా సాగుతున్న తరుణంలోనే భర్త స్థానిక లీడర్ ఆదేశాల మేరకు ఎవరూ ఊహించని వేధింపులకు పాల్పడ్డాడు.
మనకు దళిత బంధు రావాలంటే అధికార పార్టీకి చెందిన ఓ కీలక నేతతో పడుకోవాలని భర్త భార్యను వేధించాడు. ఇక భర్త వేధింపులు రోజు రోజుకు శ్రుతిమించడంతో భార్య తట్టుకోలేకపోయింది. వెంటనే భార్య ఈ దారుణంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దళిత బంధు ఆశ చూసి స్థానిక ఎంపీపీ భర్త నా భర్తను వేధిస్తున్నాడు. అతని మాట విన్నా నా భర్త ఎంపీపీ భర్తతో పడుకుంటే దళిత బంధు ఇస్తానన్నాడని, ఇందు కోసం నువ్వు అతనితో పడుకోవాలంటూ వేధించాడని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.