సమాజంలో జరుగుతున్న దారుణాలు చూస్తుంటే అసలు మనం మనుషుల మధ్యే ఉన్నామా? లేక మృగాల మధ్య బతుకుతున్నామా అనే ప్రశ్నలు కలుగుతున్నాయి. కొందరైతే అక్కా, చెల్లి, కూతురు అనే తేడా లేకుండా బరితెగించి ప్రవర్తిస్తూ ఊహించని దారుణాలకు తెగబడుతున్నారు. ఇక ఈ రోజుల్లో మహిళలకు రోడ్డుపైనే కాదు, ఇంట్లో కూడా రక్షణ లేకుండా పోతుంది. ఇదిలా ఉంటే తాళికట్టిన భార్యను సంతోషంగా చూసుకోవాల్సిన ఓ భర్త రాక్షసుడిలా ప్రవర్తించాడు. కట్టుకున్న పెళ్లాం అన్న కనికరం కూడా లేకుండా సభ్యసమాజం తలదించుకునేలా చేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు మీ కోసం.
బెంగుళూరులోని సంపిగేహళ్లిలో ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి 2011లో పెళ్లి జరిగింది. దంపతులిద్దరూ సాప్ట్ వేర్ ఉద్యోగులే కావడం విశేషం. పెళ్లైన కొంత కాలానికి ఈ భార్యాభర్తలకు ఓ కుమారుడు జన్మించాడు. పుట్టిన కొడుకుని చూసుకుంటూ ఈ దంపతులు ఆనందమైన కాపురాన్ని నెట్టుకొస్తున్నారు. ఇక దంతపతులిద్దరూ ఐటీ ఉద్యోగులే కావడంతో ఆర్థికపరమైన ఇబ్బందులు రాలేదు. అలా కొంత కాలం పాటు ఈ దంపతుల వైవాహిక జీవితం బాగానే సాగుతూ వచ్చింది. కానీ రోజులు మారే కొద్ది ఆ మహిళ భర్త రాక్షసుడి కన్న దారుణంగా తయారయ్యాడు. మద్యం, డ్రగ్స్ వంటి వాటికి బానిసై భార్యను చిత్రహింసలకు గురి చేసేవాడు. ఇక ఇంతటితో ఆగకుండా ఆ భర్త.. నా ఫ్రెండ్స్ తో పడుకోవాలంటూ ప్రతీ రోజూ టార్చర్ పెట్టేవాడు.
భార్య దీనికి అంగీకరించకపోవడంతో ఆమెపై దాడికి కూడా పాల్పడేవాడు. అయితే భర్త భార్యను బాగా టార్చర్ పెట్టడంతో ఇటీవల భర్త ఇద్దరి స్నేహితులో తప్పని పరిస్థితుల్లో శారీరకంగా కలుసుకోవాల్సి వచ్చింది. ఈ సమయంలోనే భర్త వీడియోలు కూడా తీసుకున్నాడు. ఇక రాను రాను భర్త వేధింపులను భార్య తట్టుకోలేకపోయింది. దీంతో భర్త నుంచి విడిపోవాలని భావించి ఆ మహిళ భర్తను విడాకులు కోరింది. ఇది విన్న భర్త ఆమెపై దాడికి పాల్పడ్డాడు. మరోసారి విడాకులు తీసుకుంటా అంటే.. నీ వీడియోలు బయటపెడతానంటూ బ్లాక్ మెయిల్ కు దిగేవాడు. ఇక చేసేదేం లేక ఆ మహిళ ఇటీవల స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ మహిళ భర్తను అరెస్ట్ చేశారు.