విశ్వాసంగా కుక్కలే కాదు.. విశ్వాసం అంటే ఏంటో తెలియని వస్తువులు కూడా మనుషుల కోసం పని చేస్తాయి. తప్పులు, నేరాలు చేసిన వారిని పట్టిస్తాయి. తాజాగా ఒక కారు ఒక మహిళ వివాహేతర సంబంధాన్ని బయటపెట్టింది.
భర్త నైట్ షిఫ్ట్ చేస్తుంటాడు. ఇంట్లో ఉండాల్సిన కారు రోజూ అర్థరాత్రి సమయంలో బయటకు వెళ్లి మళ్ళీ ఉదయం వస్తుంది. ఈ సమయంలో ఎవరు తీస్తున్నారా అని అనుమానం వచ్చిన భార్య ఒకరోజు లొకేషన్ కు వెళ్లి చూస్తే ప్రియుడితో లాడ్జి గదిలో భార్య అలా ఉండడం చూసి భర్తకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. బెంగళూరుకి చెందిన వ్యక్తి ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. కారులో ఉన్న జీపీఎస్ ట్రాకింగ్ సిస్టం ద్వారా తన భార్యకు వేరొక వ్యక్తితో కనెక్షన్ ఉందని గుర్తించాడు. 2014లో ఇతనికి వివాహం జరిగింది. ఆరేళ్ళ పాప కూడా ఉంది. రాత్రి పూట డ్యూటీ చేస్తుంటాడు. జీపీఎస్ ద్వారా తన భార్యకు ఎఫైర్ ఉందన్న విషయం తెలియనంత వరకూ సాఫీగా సాగిన వారి కాపురం ఇప్పుడు రోడ్డున పడింది.
ఆ ప్రైవేటు ఉద్యోగి 2020లో కారు కొన్నాడు. ఆ కారు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టంతో వచ్చిన విషయాన్ని తన భార్య సహా ఎవరికీ చెప్పలేదు. అయితే ఒకరోజు అతను డ్యూటీలో ఉండగా రాత్రి పూట తన కారుని ఎవరో ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లారని.. జీపీఎస్ లో కారు వేగంగా వెళ్తున్నట్లు కనిపించిందని.. ఒక హోటల్ దగ్గర ఆగిందని భర్త గుర్తించాడు. అర్ధరాత్రి వెళ్లిన కారు మళ్ళీ ఉదయం 5 గంటలకు ఇంటికి చేరుకుందని అతను తెలుసుకున్నాడు. మరోసారి తన కారు ఇలానే డ్యూటీలో ఉండగా అర్ధరాత్రి సమయంలో మళ్ళీ అదే హోటల్ దగ్గర ఆగింది. విషయం తెలుసుకున్న భర్త.. హోటల్ కు వెళ్ళాడు. అక్కడ ఇద్దరి ఓటర్ ఐడీ కార్డుల మీద ఒకే గది బుక్ చేయబడిందని తెలుసుకున్నాడు.
దీంతో అవాక్కయిన భర్త తన భార్య, ఆమె ప్రియుడిపై మహాలక్ష్మీపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసేందుకు పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని స్థానిక కోర్టును ఆశ్రయించాడు. ఈ విషయం తెలిసిన భార్య, ప్రియుడు ఇద్దరూ తనను బెదిరిస్తున్నారని వాపోయాడు. కోర్టు ఆదేశాల మేరకు భార్య, ప్రియుడిపై ఐపీసీ సెక్షన్ 417 కింద చీటింగ్ కేసు, సెక్షన్ 420 కింద చీటింగ్, నిజాయితీ లేకపోవడం, వస్తువుని తరలించడం కేసు, సెక్షన్ 506 కింద నేరపూరిత బెదిరింపు కేసు, సెక్షన్ 120బి కింద నేరపూరిత కుట్ర కేసులు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.