అది కర్ణాటక రాష్ట్రం. బెంగళూరులోని అన్నపూర్ణేశ్వరి నగర్‌లో బీఆర్ కాంతరాజు, రూప అనే ఇద్దరు భార్యాభర్తలు. భర్త ఫైనాన్స్ వ్యాపారీ కావటంతో ఆర్ధికంగా కూడా వీళ్లు బలంగానే నిలదొక్కుకున్నారు. ఇక ఎలాంటి సమస్యలు లేకుండా వీరి సంసారం మూడు పువ్వు ఆరు కాయలు అనే రీతిలో విజయవంతంగా కొనసాగుతు వస్తుంది.
అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్నా.. భర్త మాత్రం ఓ అసూయతో రగిలిపోతున్నాడు. ఎందుకనుకుంటున్నారా? పెళ్లైన నాటి నుంచి సంతోషంగా జీవిస్తున్న వీరి కాపురంలో ఈ మధ్య కాలంలో తన భార్య అందంగా ఉందని భర్త కాస్త అనుమనంతో ఉండేవాడు. అయితే ఇటీవల కాలంలో భర్యాభర్తలిద్దరూ పుట్టింటి వారితో కలిసి చిక్‌మంగళూరుకు టూర్‌కు వెళ్లారు. దీంతో అక్కడున్నవాళ్లంత తన భార్య అందాన్ని పోగడటం, కొంతమంది యువకులు తన వంకే చూడటం భర్త కాంతా రాజు పసిగట్టాడు. దీంతో అతడిలో అనుమానపు రేకలు విచ్చుకున్నాయి.
ఇక అప్పటి నుంచి భార్యతో గొడవకు దిగేవాడు. నీవు ఎవరితో వివాహేతర సంబంధం పెట్టుకున్నావని పదే పదే గొడవలక దిగేవాడు. ఇక భార్య మాత్రం అలాంటిది ఏం లేదంటూ సర్దుకుంటూ వచ్చేది. కానీ భర్తకు రోజు రోజుకు భార్యపై అనుమానం బలపడుతూ వస్తుంది. దీంతో ఎలాగైన తన భార్యను అంతమొందించాలని భావించాడు. ఇక అలా హత్యచేసేందుకు పథకం వేసుకుని భర్త ఎదురుచూస్తున్నాడు. ఇంతలోనే తను అనుకున్న సమయం కూడా రానే వచ్చింది.
ఓ రోజు రాత్రి భార్యతో నువ్వు అందంగా ఉండటంతో అందరితో మాట్లాడుతున్నావని, నీకు ఖచ్చితంగా ఎవరితో సంబంధాలు ఉన్నావని తెగేసి చెప్పాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ కాస్త తీవ్ర రూపం దాల్చింది. ఇక ఆగ్రహంతో ఊగిపోయిన భర్త ఇంట్లో ఉన్న స్క్రూడైవర్ తీసుకుని భార్య గొంతులో పొడిచి అతి కిరాతంగా హత మర్చి పరారయ్యాడు. ఇక స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇక పరారీలో ఉన్న భర్త కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇలాంటి అనుమానంతో రంకెలేసిన భర్త తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.