ఈ మధ్య కాలంలో సమాజంలో నేర ప్రవృత్తి విపరీతంగా పెరిగిపోతుంది. మరీ ముఖ్యంగా ఈజీ మనీకి ఆశపడి.. దాన్ని సంపాదించడం కోసం అడ్డదారులు తొక్కేవారి సంఖ్య భారీగా పెరుగుతుంది. చైన్ స్నాచింగ్, డ్రగ్స్ సరఫరా, దొంగతనాలు వంటి నేరాలకు పాల్పడుతన్న వారిలో ఉన్నత చదువులు చదివిన వారు కూడా ఉండటం విచారకరం. ఈ క్రమంలో తాజాగా మరణుప్పరంలో ఓ భారీ దొంగతనం చోటు చేసుకుంది. సినీ ఫక్కీలో జరిగిన ఈ చోరీలో కేవలం 18 నిమిషాల వ్యవధిలోనే 14 కోట్ల రూపాయల విలువైన సొత్తును ఎత్తుకెళ్లారు దొంగలు. ఆ వివరాలు..
రాజస్తాన్, ఉదయ్‌పూర్‌లోని మణప్పురం గోల్డ్ లోన్ బ్యాంక్ బ్రాంచ్‌లో ఈ దొంతగనం చోటు చేసుకుంది. ఐదుగురు దుండగులు ముఖాలకు ముసుగేసుకుని.. మణప్పురం బ్రాంచ్‌లో చొరబడ్డారు. లోపలకు వెళ్లగానే తమ దగ్గర ఉన్న గన్‌తో సిబ్బందిని బెదిరించారు. అందరిని ఒక్కచోట కూర్చొబెట్టి.. లోపలివారు బయటకు పోకుండా.. బయటివారు లోపలికి రాకుండా లాక్ చేశారు.
దొంగలపై ఎదురుతిరిగిన సిబ్బందిపై దాడి చేసి.. వారి దగ్గర నుంచి సెల్‌ఫోన్స్ లాక్కున్నారు. అనంతరం లాకర్ తాళాలు తీసుకుని వెళ్లి.. సుమారు 24 కిలోలల బంగారు ఆభరణాలు, 10 లక్షల రూపాయలకు పైగా నగదు దోచుకెళ్లారు. అనంతరం సిబ్బంది మొత్తాన్ని ఓ రూమ్‌లో బంధించి చక్కా వెళ్లిపోయారు. ఈ మొత్తం సంఘటన అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యింది.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుల కోసం గాలించడం ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ పోలీసులను మొహరించి నిందితుల కోసం గాలించడం ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు పోలీసులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.