దొంగతనం.. అక్రమంగా, అన్యాయంగా కష్టపడకుండా దోచుకెళ్తూ దొంగతనానికి పాల్పడుతుంటారు. ఇలాంటి ఘటనలు దేశంలో రోజుకొక చోట వెలుగు చూస్తున్నాయి. ఇదిలా ఉంటే చదువు, బాధ్యత లేకుండా రోడ్డుపై జులాయిగా తిరుగుతూ ఉండే వ్యక్తులు దొంగతనానికి పాల్పడితే ఆశ్యర్యం లేదు. కానీ.. బాగా చదువుకున్న వ్యక్తులో, ఓ డాక్టరో దొంగతనం చేస్తే ఎలా ఉంటుంది. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ హోమిమోపతి డాక్టర్ దుప్పట్ల దొంగతనానికి పాల్పడ్డాడు. వినటానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఇది నిజం. ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలు డాక్టర్ అయి ఉండి ఎందుకు దొంగతనానికి పాల్పడాల్సి వచ్చిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
రాజస్థాన్ లోని భరత్ పూర్ ప్రాంతానికి చెందిన శైలేంద్ర అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అయితే శైలేంద్ర హోమియోపతి డాక్టర్ గా సేవలు అందిస్తున్నాడు. ఇలా మంచి హోదాలో ఉన్న శైలేంద్ర ఉన్నట్టుండి ఎవరూ ఊహించని పాడుపనికి పాల్పడ్డాడు. విషయం ఏంటంటే? శైలేంద్ర ఇటీవల ఓ రోజు రాత్రి తన నలుగురు స్నేహితులతో కలిసి బైక్ పై రోడ్డుపై వెళ్లాడు. ఇక వెళ్తూ వెళ్తూ.. రోడ్డు పక్కన అమ్మే 8 దుప్పట్లను తీసుకుని పరారయ్యారు. ఇది గమనించిన ఆ వ్యాపారి వారిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ దొరకకుండా వాళ్లు పారిపోయాడు.
వెంటనే ఆ వ్యక్తి పోలీసులు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తారు. ఇక ఎట్టకేలకు పోలీసులు నిందితులు అయిన నలుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుల్లో ఒకరు మైనర్ కాగా, మరో ముగ్గురు మేజర్లు. విషయం ఏంటంటే? నిందితుల్లో ఒకరు హోమియోపతి డాక్టర్ ఉండడం విశేషం. అయితే డాక్టర్ అయి ఉండి ఎందుకు దొంగతనానికి పాల్పడ్డాడని అందరూ జుట్టు పీక్కుంటున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.