ప్రేమకు కులం, మతం, ప్రాంతం ఏదీ అడ్డుకాదు. వయసొచ్చిన యువతి యువకులు ఒకరినొకరిని అర్థం చేసుకుని ప్రేమించుకుంటున్నారు. మతాలు వేరైనా చివరికి తల్లిదండ్రులలను ఎదురించి ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. ఇలా ప్రేమించుకునే క్రమంలో వారి వివాహ వయసును మరిచి ఏకంగా పెళ్లిళ్లు చేసుకుంటున్న ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్నాయి. అచ్చం ఇలాంటి ఘటనే గుజరాత్ లో చోటు చేసుకుంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అహ్మదాబాద్ లో ఉంటున్న 19 ఏళ్ల ముస్లిం యువతి తల్లిదండ్రులు లేకపోవడంతో మేనత్త వద్ద ఉంటూ 10వ తరగతి వరకు చదువుకుంది. అయితే ఈ క్రమంలోనే వీరి వీదిలో ఉంటున్న ఓ హిందు యువకుడితో పరిచయం పెంచుకుంది. వీరిద్దరి మతాలు వేరైన ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. ఇక కొంత కాలానికి ఆ యువతి కుటింబికులు ఆమెకు పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న యువతి యువకుడు పెళ్లికి సిద్దపడ్డారు. వీరి ప్రేమ విషయం ఇరువురి కుటింబికులకు తెలియడంతో వీరి పెళ్లికి నిరాకరించారు.
దీంతో ఎలాగైన పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుని పారిపోయి వివాహం చేసుకున్నారు. అలా కుటుంబ సభ్యులకు తెలియకుండా కొంతకాలం దూరంగా ఉంటున్నారు. ఇక కొన్నాళ్ల తర్వాత వీళ్లు ఎక్కడుంటున్న విషయం ఇరువురి కుటుంబికులకు తెలిసింది. తమ కుమారుడికి వివాహ వయసు లేకున్నా ఆ యువతి పెళ్లి చేసుకుందని, పోలీసులకు ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించడం మొదలు పెట్టారు. దీంతో భయంతో ఇరువురి కుటింబికుల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ప్రియుడు, ప్రియురాలు దూరంగా ఉంటున్నారు.
అప్పటికీ ఆ యువతి గర్భవతితో ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే..? ప్రియురాలి కంటే ప్రియుడు వయసులో చిన్నవాడు కావడం, పైగా వివాహ వయసు కూడా లేకపోవడం విశేషం. దీంతో కుటింబికుల నిర్ణయం మేరకు వీరిద్దరిని యువతి మేనత్త వద్ద, యువకుడు తల్లిదండ్రుల చెంతకు చేరుకున్నారు. ఇక ఆ యువతి గర్భవతి కావడంతో ఆమెను ఇంటి నుంచి గెంటేయడంతో అభయం సంస్థను ఆశ్రయించింది. ఆ తర్వాత కొంత కాలానికి ఆ యువతి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో పుట్టిన బిడ్డను ఓ సంస్థలో చేర్పించారు. కాగా తన ప్రియుడికి పెళ్లీడు వచ్చిన తర్వాత ఇద్దరం మళ్లీ పెళ్లి చేసుకుని తమ బిడ్డను తెచ్చుకుంటామని యువతి బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. గుజరాత్ జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ హిందు, ముస్లిం ప్రేమకథపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.