మనిషి డబ్బు కోసం దేనికైనా సిద్దపడుతున్నాడు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడం కోసం ఎన్ని అక్రమాలైనా చేస్తున్నాడు. ముఖ్యంగా డ్రగ్స్ దందా, హైటెక్ వ్యభిచారం, చైన్ స్నాచింగ్ లాంటివి చేస్తు పోలీసులకు పట్టుబడుతున్నారు.
ఈ మద్య చాలా మంది ఈజీ మనీ కోసం ఎన్నో అక్రమాలకు పాల్పపడుతున్నారు. ఎదుటి వారి ప్రాణాలు పోయినా సరే తమకు డబ్బే ప్రాధాన్యతగా భావిస్తున్నారు. పెద్ద పెద్ద నగరాల్లో డ్రగ్స్ దందా సాగిస్తూ యువతను టార్గెట్ చేసుకొని వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. పోలీసులు ఎంత నిఘా పెట్టినా.. అక్రమార్కులు తమ దందా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో భారీగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు పట్టుబడ్డాయి. వివరాల్లోవెళితే..
ఈ మద్య కొంతమంది యూత్ తమ శరీర సౌష్టవాన్ని పెంచుకోవడానికి స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు. ఇలాంటి వారి బలహీనతను క్యాష్ చేసుకుంటున్నారు కేటుగాళ్ళు. తాజాగా శరీరాకృతిని పెంచడానికి స్టెరాయిడ్, హార్మోన్ ఇంజెక్షన్లు, టాబ్లేట్టను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. అమీర్ పేటకు చెందిన ఓం ప్రకాశ్ ప్రొటీన్ వ్యాపారం చేస్తుండగా.. నరేష్ అనే వ్యక్తి అతనికి సరఫరా చేస్తున్నాడు. జిమ్ కోచ్ గా సయ్యద్ ఫరూక్ వ్యవహరిస్తున్నాడు. ఈ ముగ్గురు కొంతకాలంగా ఒక ముఠాగా ఏర్పడి యూత్ ని టార్గెట్ చేసుకొని వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం రావడంతో స్కెచ్ వేసి పట్టుకున్నారు. నిందితుల నుంచి భారీ ఎత్తు ఇంజెక్షన్లు, టాబ్లేట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఎక్కువగా జిమ్ చేసేవారు వాడుతున్నారని.. తక్కువ సమయంలో శరీరాన్ని ఫిట్ గా మార్చుకునేందుకు స్టెరాయిడ్స్ ని ఆశ్రయిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.
ఇటీవల హైదరాబాద్ లో ఇలాంటి వ్యాపారాలు ఎక్కువ అవుతున్నాయని.. తక్కువ సమయంలో శరీరాకృతిని పెంచుకునేందుకు యువత ప్రయత్నిస్తున్నారని.. అలాంటి వారిని టార్గెట్ చేసుకొని వారికి స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, ట్యాబ్ లెట్లను విక్రయిస్తున్నారని పోలీసులు అంటున్నారు. ఈ మద్యనే ఓ ముఠాను సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. జిమ్ లో వీరి పెద్ద ఎత్తున స్టెరాయిడ్స్ స్వాధీనపర్చుకున్నారు. ఈ ముఠా సభ్యులు నగరంలోని జిమ్స్ కు సంబంధించిన నిర్వాహకుల నెంబర్లు తీసుకొని వారికి స్టెరాయిడ్స్, ఇంజక్షన్ల గురించి చెప్పడం.. కమీషన్ పద్దతిలో యువతకు విక్రయించడం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి స్టెరాయిడ్స్ వాడటం వల్ల భవిష్యత్ లో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు.