ఫోటోలో కనిపిస్తున్న యువతి పేరు రమ్య ప్రసన్న. ఆదివారం సెలవు కావడంతో లక్ష్మణ్ అనే స్నేహితుడితో సరదాగా గడిపేందుకు హైదరాబాద్ పరిధిలోని సంఘీ టెంపుల్ ను దర్శించుకునేందుకు వెళ్లారు. సంతోషంగా వెళ్లి దేవుడిని దర్శించుకుని తిరిగి వస్తుండగా ఊహించని విషాదం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రమ్య ప్రసన్న(22) మేడ్చల్ జిల్లా షాపూరు కు చెందిన బొక్క లక్షణ్ అనే స్నేహితుడితో ఆదివారం సెలవు కావడంతో సరదాగా గడిపేందుకు వెళ్దామని అనుకున్నారు. ఇక కోహెడ పరిధిలోని సంఘీ దేవాలయాన్ని దర్శించుకునేందుకు వెళ్దామని చెప్పి వెళ్లారు. ఇక సంతోషంగా వెళ్లి దేవుడిని దర్శించుకుని తిరిగి పయనమయ్యారు. ఈ క్రమంలోనే రామోజీ ఫిల్మ్ సిటీ వద్ద యూ టర్న్ తీసుకుంటుండగా విజయవాడ వైపు వెళ్తున్న ఓ లారీ వేగంగా వచ్చి వీరి బైక్ ను ఢీ కొట్టింది.
ఇది కూడా చదవండి: Langer House: మరొకరితో ప్రియురాలి పెళ్లి.. మండపంలోనే నిప్పంటించుకున్న ప్రియుడు!
ఈ ప్రమాదంలో రమ్య ప్రపన్న కింద పడడంతో ఆమె తలపై నుంచి లారీ చక్రాలు వెళ్లాయి. దీంతో రమ్య ప్రసన్న అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగ యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే యువతి మృతదేహాన్నిపోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి లక్ష్మణ్ ను హయత్ నగర్ లో ఓ ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతన్నారు. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటనతో యువతి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.