సమాజంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే.. అబ్బాయిలు పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడమే మంచిదని అనిపిస్తోంది. కాదని పెళ్లి చేసుకొన్నా పెళ్ళాం చేతిలో బలవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అందరూ ఇలానే ఉండకపోవచ్చు కానీ, భయపెట్టడానికి ఇలాంటి సంఘటనలు నాలుగు చాలు. ప్రియుడితో పొందుతున్న పడక సుఖానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఓ మహిళ.. తన ప్రియుడితో కలిసి కట్టుకున్నోడిని హతమార్చింది. ఈ ఘటన హయత్‌నగర్‌లో చోటుచేసుకుంది.
హయత్‌నగర్‌లో నివాసం ఉండే శంకర్ గౌడ్, రజిత ఇద్దరూ భార్యాభర్తలు. వీరు టీఎస్ ఆర్టీసీలో కండక్టర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. శంకర్ కూకట్‌పల్లి డిపోలో పనిచేస్తుండగా, రజిత హయత్ నగర్ డిపో-1లో పని చేస్తోంది. అయితే.. వీరిద్దరి డ్యూటీ సమయాలు వేరు వేరు. దీన్ని అవకాశంగా తీసుకున్న రజిత తాను పని చేసే డిపోలోనే రాజ్‌కుమార్ అనే కానిస్టేబుల్ తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. శంకర్ గౌడ్ డ్యూటీ కోసం వెళ్లగానే.. రాజ్‌కుమార్ రజిత కోసం ఇంటికి వచ్చేవాడు. అలా ఇంటిలోకి వచ్చే ప్రియుడు ఎప్పుడో బయటకి వెళ్ళేవాడు. చుట్టుప్రక్కల వారు చూసి నానారకాలుగా మాట్లాడుకోవడంతో విషయం శంకర్ గౌడ్ చెవికి చేరింది. దీంతో అతను ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా ఆమెను మందలించాడు. అది ఆమెకు నచ్చలేదు.
భర్త లేకుంటే.. ప్రియుడితో సంతోషంగా ఉండొచ్చని భావించిన కట్టుకున్నోడిని లేపేయడానికి ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. ఈ ఏడాది మార్చి 7న రాత్రి డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న శంకర్‌పై.. రాజ్‌కుమార్, అతని స్నేహితులు దాడిచేశారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన శంకర్ మంచానికే పరిమితం అయ్యాడు. పైగా గుర్తు తెలియని వ్యక్తులు తన భర్తపై దాడి చేశారని రజిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించినా.. నిందితులెవరు అనేది పోలీసులు కనిపెట్టలేకపోయారు. ఆ దాడిలో తీవ్ర గాయాలపైన శంకర్.. మూడు నెలల అనంతరం గుండెపోటుతో మరణించాడు.
ఇక్కడితో అడ్డు తొలగిందనుకున్న రజిత.. రాజ్‌కుమార్ తో విచ్చలవిడిగా రాసలీలలు మొదలుపెట్టింది. పైగా తన భర్తపై దాడికి సంబంధించిన విషయాన్ని తన స్నేహితురాలితో పంచుకుంది. ఇదే ఆమెను పట్టించింది. రజిత స్నేహితురాలు అతని సోదరుడికి చెప్పడం, అతడు శంకర్ గౌడ్ సోదరుడికి చెప్పడంతో అసలు విషయం బయటకు వచ్చింది. శంకర్ సోదరుడు పోలీసులకు పిర్యాదుచేయడంతో.. కేసును తిరిగి ఓపెన్ చేసిన పోలీసులు.. రాజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. రజితతో వివాహేతర సంబంధమే ఈ దాడికి కారణమని జరిగిందంతా వివరించాడు. దీంతో రాజ్‌కుమార్, అతని స్నేహితులు నీరజ్, ఉమాకాంత్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న శంకర్ భార్య రజిత కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.