కొన్ని రోజుల క్రితం ఓ ప్రముఖ సింగర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. మృతురాలి దగ్గర ఎంతో నమ్మకంగా పని చేసిన వారే.. ఆమె ప్రాణం తీశారు. నమ్మిన వారే ఆమె గొంతు కోశారు. అయితే రిలేన్‌షిప్‌లో వచ్చిన విబేధాల కారణంగానే ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ క్రమంలో చెరకు రసంలో నిద్ర మాత్రలు కలిపి సింగర్ కు ఇచ్చారు. స్పృహ కోల్పోయిన తర్వాత ఆమెను దారుణంగా హత్య చేశారు. తాజాగా పోలీసులు ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఇక కొన్ని రోజుల క్రితం ఢిల్లీకి చెందిన దివ్య ఇండోరా అలియస్ సంగీత (29) మృతి చెందిన సంగతి తెలిసిందే. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా.. షాకింగ్ ట్విస్ట్‌లు వెలుగు చూశాయి. ఆ వివరాలు..
సింగర్ సంగీత ఈ నెల 11వ తేదీన కనిపించకుండా పోయింది. గాలింపు చర్యలు సాగుతుండగానే.. మూడు రోజుల తర్వాత ఆమె రోహ్‌తక్ మెహమ్ ప్రాంతంలో శవమై తేలింది. ఈ కేసును సీరియస్‌గా విచారణ చేపట్టి పోలీసులు.. ఆమెతో పాటు పనిచేస్తున్న రవి, అనిల్‌లను అదుపులోకి తీసుకుని విచారించగా.. సంగీతను తామే హత్య చేసినట్లు వారు ఒప్పుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రవి సూచన మేరకు అనిల్ ఢిల్లీకి వచ్చి సంగీతను కారులో తీసుకుని మెహం వైపు వెళ్లాడు. ఈ క్రమంలో మధ్యలో కారు ఆపిన అనిల్.. చెరుకు రసంలో 10 నిద్రమాత్రలు కలిపి.. దాన్ని సంగీతకు ఇచ్చి తాగించాడు.
ఇది కూడా చదవండి: Nagababu: కోనసీమ వివాదం.. సజ్జలపై విరుచుకుపడ్డ నాగబాబు.. ఏకంగా వెధవ అంటూ!
ఆ తరువాత వీరు హర్యానాలోని కలనౌర్ దగ్గర చేరుకోగా.. వీరితో ప్రధాన నిందితుడు రవి కలిశాడు. గులాటి డాభాలో ముగ్గురు కలిసి భోజనం చేసి.. మళ్లీ కారులో బయలుదేరారు. ఆ తరువాత వారు మెహం సమీపంలోకి రాగానే.. సంగీత స్పృహ కోల్పోయింది. ఈ తరుణంలో రవి ఆమె గొంత నులిమి హత్య చేశాడు. అనంతరం రవి, అనిల్ కలిసి సంగీత మృతదేహాన్ని మెహం సమీపంలో పాతిపెట్టారని పోలీసులు వెల్లడించారు. రిలేషన్ షిప్‌లో వచ్చిన విభేదాల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు తెలిపారు. నిందితుల మీద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Hrithik Roshan – Sussanne Khan: వైరల్ గా మారిన హృతిక్ రోషన్ దంపతులు.. లవర్స్ తో వేరు వేరుగా పార్టీకి అటెండ్!