దేశంలో ఏ వ్యవస్థలో చూసినా, ఎక్కడ చూసినా లంచం లేనిదే పని జరగడం లేదు. చిన్న పనికి సైతం ముడుపులు చెల్లించుకోవాల్సిందే. లేదంటే ఆఫీసుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరగాలి. ఇక పోలీసు వ్యవస్థ గురించి చెప్పనక్కర్లేదు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు అపనమ్మకమే ఉంది. అందులో లంచాలు లేనిదే పని జరగదన్న అపవాదు ఉంది. తాజాగా ఓ ఎస్ఐ ముడుుపులు తీసుకుంటూ పట్టుబడ్డారు.
దేశం అవినీతిలో కూరుకుపోతోంది. ఓ పని కోసం చిన్న అధికారుల నుండి ఉన్నతాధికారుల వరకు ముడుపులు చెల్లించుకోవాల్సిందే. లేదంటే ఆఫీసుల చుట్టూ తిప్పుకోవడమో, వ్యక్తిగత అవసరాలకు వినియోగించడమే చేస్తున్నారు. దీనికి అనేక మంది బాధితులయ్యారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. జనాలకు రక్షణగా నిలవాల్సిన రక్షక భటులే అమ్యామ్యాలకు కక్కుర్తి పడుతున్నారు. న్యాయాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు లంచాలు తీసుకుంటూ గౌరవ వృత్తిని అభాసుపాలు చేస్తున్నారు. తాజాగా ఓ మహిళా సబ్ ఇన్ స్పెక్టర్ ముడుపులు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయింది. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. అయితే ఇందులో విచిత్రమేమిటంటే. . ఆ మహిళా ఎస్ఐ నిజాయితీకి మారు పేరుగా అవార్డును పొందడం గమనార్హం.
వివరాల్లోకి వెళితే.. హర్యానాలోని భివానీ ఖెడా పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు మున్నీ దేవి. అయితే ఆమె 5వేలు లంచం పుచ్చుకుంటూ విజిలెన్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఆమె ముడుపులు డిమాండ్ చేశారన్న సమాచారంతో హిసార్, భివానీ విజిలెన్స్ అధికారులు .. కాపు కాశారు. భివానీలోని మిని సెక్రటేరియట్ లో ముడుపులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కాగా, ఇదే ఎస్ఐ .. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా తన పనికి, నిజాయితీకి అవార్డును పొందడం గమనార్హం. ఆమెను అధికారులు అరెస్టు చేసి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో నేషనల్ క్రైం ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఎన్సీసిబిఐ) సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేయగా నెట్టింట్లో వైరల్ గా మారుతోంది. దీంతో ఆమె ఏడుస్తున్నట్లు కనిపిస్తోంది.
कल हिसार एवं भवानी विजिलेस विभाग की संयुक्त टीम ने बवानीखेड़ा की महिला सब इंस्पेक्टर मुन्नी देवी को भिवानी लघु सचिवालय में 5 हजार रुपए रिश्वत लेते किया गिरफ़्तार। विदित हो कि, ये वही महिला एसआई हैं जिसे गणतंत्र दिवस पर उनके बेहतर काम और ईमानदारी के लिए सम्मानित किया गया था। pic.twitter.com/lzofLm1guk
— NCIB Headquarters (@NCIBHQ) March 29, 2023