హర్యానాలో దారుణం చోటు చేసుకుంది. అర్థరాత్రి ఆస్పత్రిలో నిద్రిస్తున్న ఓ శిశువుని కుక్కలు ఎత్తుకెళ్లి చంపేశాయి. తాజాగా వెలుగు చూసిన ఈ విషాద ఘటన తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పానిపట్ కు చెందిన షబ్నం అనే మహిళ మూడు రోజుల క్రితం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ శిశువుకు జన్మనిచ్చింది. దీంతో భార్యాభర్తలతో పాటు బంధువులంతా తెగ సంబరపడ్డారు.
అయితే సోమవారం రాత్రి ఆ శిశువును బెడ్ పై పడుకోబెట్టి తల్లితో పాటు మరో మహిళ నిద్రిస్తున్నారు. అర్థరాత్రి అందరూ నిద్రలోకి జారుకున్నాక శిశువు ఉన్న రూంలోకి ఓ కుక్క వచ్చింది. అటు ఇటు అంతా చూసింది. ఎక్కడ కూడా తినే ఆహారం దొరకలేదు. దీంతో బెడ్ పై నిద్రిస్తున్న ఆ శిశువు వద్దకు మెల్లగా వెళ్లి నోటితో ఆ శిశువును బయటకు ఎత్తుకెళ్లి చంపేసింది. ఇక కొద్దిసేపటి తర్వాత తల్లి నిద్రలేచి చూస్తే పక్కన తన బిడ్డ కనిపించలేదు. దీంతో ఖంగారు పడి ఆస్పత్రి అంతా గాలించారు.
ఇది కూడా చదవండి: Guntur: అందంగా ఉందని ఎదురు కట్నమిచ్చి పెళ్లి చేసుకున్నాడు.. పెళ్లయ్యాక తెలిసింది ఏంటంటే?
అయినా కూడా ఆ శిశువు జాడ కనిపించలేదు. వెంటనే ఆస్పత్రి సిబ్బందికి సమాచారం అందించారు. అయితే వారంతా వెతుకుతుండగా ఆస్పత్రి సమీపంలో ఓ చోట కుక్క పక్కన ఉండగా ఆ శిశువుని గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన శిశువును చికిత్స అందించే ప్రయత్నం చేసినా ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఇక ఆస్పత్రి నిర్లక్ష్యం కారణంగానే ఈ చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.