వీళ్లిద్దరూ భార్యాభర్తలు. వీరికి గత కొన్నేళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కాలం నుంచి ఈ దంపతులు సంతోషంగానే జీవించారు. భర్త స్థానికంగా ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ కాపురాన్ని ఈడ్చుకుంటూ వచ్చాడు. ఇలా సంతోషంగా సాగుతున్న వీరి కాపురంలో ఒక్కసారిగా మనస్పర్ధలు వచ్చి చేరాయి. దీంతో గత కొంత కాలం నుంచి భార్యాభర్తల మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా తయారైంది. ఈ క్రమంలోనే భర్త తుపాకీతో భార్యను కాల్చాడు. ఇక ఇంతటితో ఆగని భర్త.. మరో కిరాతకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
హర్యానాలోని బహదూర్ ఘర్ ప్రాంతంలో సంతోషి (32), హన్సరాజ్ దంపతులు నివాసం ఉంటున్నారు. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు ఎలాంటి గొడవలు, మనస్పర్థలు లేకుండా సంసారాన్ని ఈడ్చుకుంటూ వచ్చారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుంచి భార్యాభర్తల మధ్య గొడవలు చెలరేగాయి. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకునేవారు. కాగా, తాజాగా ఈ దంపతులు మరోసారి గొడవ పడ్డారు. క్షణికావేశంలో ఊగిపోయిన భర్త హన్సరాజ్.. తన వద్ద తుపాకీతో భార్యపై మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు.
ఇక ఇంతటితో ఆగని ఆ వ్యక్తి అదే తుపాకీతో తానూ కాల్చుకున్నాడు. అయితే ఈ దారుణంలో భర్త హాన్సరాజ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, భార్య సంతోషి మాత్రం కొన ప్రాణాలతో బయటపడింది. ఇది చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరినీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే భర్త హాన్సరాజ్ చనిపోయాడని, ప్రాణాలతో ఉన్న సంతోషికి వైద్యం అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగానే ఉన్నట్లు కూడా వైద్యులు అన్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతుంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.