నువ్వుంటే ఇష్టం, నువ్వు లేకుండా ఉండలేనన్నాడు. అతని మాటలు నమ్మిని ఆ బాలిక అతగాడి ప్రేమలో మునిగిపోయింది. దీంతో ఇద్దరూ కొన్నాళ్ల పాటు ప్రేమ విహారంలో తేలియాడి ఎంజాయ్ చేశారు. కట్ చేస్తే.. చివరికి అదే ప్రియుడి చేతిలో ప్రియురాలు హత్యకు గురైంది. అసలేం జరిగిందంటే?
ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు. మొదట్లో ఇవేం పట్టించుకోని ఆ బాలిక..చివరికి అతడి ప్రేమకు కరిగిపోయింది. కొంత కాలం తర్వాత ఆ బాలిక అతగాడి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఇద్దరూ ప్రేమ విహారంలో తేలియాడారు. కట్ చేస్తే.. అదే బాలిక చివరికి ప్రియుడి చేతిలో హత్యకు గురై ఓ ఫామ్ హౌస్ లో శవమై తేలింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. హర్యానా రాష్ట్రం గుండార్ సోనిపట్ గ్రామంలో సునీల్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అయితే ఇతనికి గతంలో రోహ్‌తక్ పరిధిలోని బాలంద్ గ్రామానికి చెందిన మోనిక అనే బాలికతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయంతోనే సునీల్ ఆ బాలికతో తరుచు ఫోన్ లో మాట్లాడేవాడు. కానీ, రాను రాను సునీల్ మోనికపై మనసుపడ్డాడు. కొంత కాలం నుంచి ప్రేమిస్తున్నానని సునీల్ మోనిక వెంటపడ్డాడు. ఇక చివరికి మోనిక అతగాడి మాటలకు కరిగిపోయి సరేనంటూ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
దీంతో ఇద్దరూ ప్రేమ విహారంలో తేలియాడారు. సినిమాలు, షికారులు అంటూ తెగ తిరిగి బాగానే ఎంజాయ్ చేశారు. అయితే రాను రాను ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి గొడవలు జరిగాయి. ఇక సునీల్ మాత్రం ప్రియురాలు మోనికపై కోపంతో రగిలిపోయాడు. ఎలాగైన మోనికను చంపాలని అనుకుకున్నాడు. ఇందు కోసం పక్కా ప్లాన్ తో సునీల్ మోనికను జనవరి 22న ఓ చోటుకు రమ్మన్నాడు. ఇద్దరు మరోసారి గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే సునీల్ మోనికను దారుణంగా హత్య చేశాడు.
అనంతరం ప్రియురాలి మృతదేహాన్ని సోనిపట్‌లోని ‘పిండ్ గర్హి ఝంఝరా రోడ్’లో ఫాంహౌస్ లో పాతిపెట్టాడు. ఉన్నట్టుండి మోనిక కనిపించకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అనుమానంతో ఆమె ప్రియుడు సునీల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. అతని ఇచ్చిన సమాచారంతో పోలీసులు పిండ్ గర్హి ఝంఝరా రోడ్ ఉన్న ఫామ్ హౌస్ లో పాతిపెట్టిన మోనిక మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. ఈ విషయం తెలుసుకున్న మృతురాలి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.