కాలం మార్పులకు అనుగూణంగా లైంగిక దాడుల్లో సైతం దారుణమైన మార్పులు పుట్టుకొస్తున్నాయి. అయితే కొందరు కేటుగాళ్లు వావివరసలు మరిచి బరితెగింపుగా వ్యవహరిస్తున్నారు. దారుణాల్లో భాగంగా అడ్డొచ్చిన చెల్లిని, ఎదురొచ్చిన ముసలవ్వను కూడా వదలకుండా అత్యాచారాలకు తెగబడుతున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ మేనమామ కోడలిపై లైంగిక దాడికి పాల్పడి బ్లాక్ మెయిలింగ్ కు దిగాడు. ఇటీవల జరిగిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఇది కూడా చదవండి: మరో యువతితో కాపురం.. భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని చితక్కొట్టింది..
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని జింద్‌లోని జులనా పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతికి కొన్ని రోజుల క్రితం వివాహం జరిగింది. భర్తతో సంతోషంగా సాగుతున్న ఆమె కాపురంలో మేనమామ నిప్పులు పోశాడు. కాగా గతంలో మేనకోడలిపై బలవంతంగా మామ అత్యాచారానికి చేసి వీడియోలు తీశాడు. దీంతో ఇప్పుడు అదే వీడియోలు ఆమె భర్తకు పంపుతానంటూ బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడ్డాడు. ఇంతటితో ఆగకుండా నాకు రూ.2 లక్షలు ఇవ్వాలని లేకుంటే బంధువులందరికీ నీ వీడియోలు పంపుతానంటూ వార్నింగ్ కూడా ఇచ్చాడు.ఇక ఈ క్రమంలోనే తాజాగా ఆ వీడియోలు ఏకంగా ఆమె భర్తకు పంపి మేనకోడలి కాపురాన్ని నిట్టనిలువునా చీల్చాడు. దీంతో భర్త విడాకులు ఇస్తానంటున్నాడని నాకు ఎలాగైన న్యాయం చేయాలంటూ బాధిత మహిళ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనలో మేనమామ చేసిన దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.