ప్రతీ సమస్యకు ఓ పరిష్కార మార్గం ఉంటుంది. మాములుగా ప్రజల సమస్యలను ప్రజా ప్రతినిధులు గాలికొదిలేస్తే వారి తీరు పట్ల ప్రజలు తిరగబడి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటారు. ఇలా రోడ్లలపై రకరకాల నిరసనల రూపంలో తమ డిమాండ్లు తెలియజేస్తూ తక్షణమే న్యాయం చేయాలని ప్రజలు వేడుకుంటుంటారు. ఇదిలా ఉంటే ఓ వ్యక్తికి ఏదైన అన్యాయం జరిగితే పోలీసులను ఆశ్రయిస్తాడు. నమ్మిన పోలీసులే న్యాయం చేయకుంటే ఏం చేయాలి. ఇలా ఓ బాధిత కుటుంబానికి పోలీసులు న్యాయం చేయట్లేదని ఓ భర్త నా భార్యకు న్యాయం చేయాలంటూ ఏకంగా సెల్ ఫోన్ టవర్ ఎక్కిన ఘటన హన్మకొండలో చోటు చేసుకుంది.
అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బాలసముద్రంలో శంకరయ్య, కవిత ఇద్దరు భార్యాభర్తలు. అయితే వారం రోజుల కిందట కవితపై కొందర వ్యక్తులు దాడి చేశారు. ఇదే దాడి విషయమై భార్య స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు న్యాయం చేస్తామని మాటిచ్చి వారిని అరెస్ట్ చేయకుండా, ఎలాంటి న్యాయం చేయలేదు.
ఇది కూడా చదవండి: Madhya Pradesh: వివాహేతర సంబంధం ఎప్పటి నుంచో ఉంది.. కలిపింది కూడా మా అత్తామామలే!
దీంతో పోలీసుల తీరుతో విసిగిపోయిన కవిత భర్త వినూత్నంగా బాలసముద్రంలోని ఓ సెల్ ఫోన్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. నా భర్యను ఇటీవల ముగ్గురు వ్యక్తులు దాడి చేశారని, వారిని అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలంటూ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు న్యాయం జరిగిలే చర్యలు తీసుకుంటామని మాటివ్వడంతో వెంకటేష్ సెల్ టవర్ దిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.