Guntur: భార్య వివాహేతర సంబంధం కారణంగా ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసి, తన ఆవేదనను రికార్డ్ చేశాడు. తన భార్యను కఠినంగా శిక్షించాలని సెల్ఫీ వీడియోలో కోరాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది. ప్రాథమిక వివరాలు, మృతుడు సెల్ఫీ వీడియోలో తెలిపిన వివరాల మేరకు.. గుంటూరు జిల్లా, మేడి కొండూరు మండలం, తురకపాలేనికి చెందిన షేక్ భరణి భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన భరణి ఆమెను హెచ్చరించాడు. అయినా ఆమె తన పద్ధతి మార్చుకోలేదు. ఈ నేపథ్యంలోనే భార్య తనను పలుమార్లు చంపటానికి ప్రయత్నించిందని తల్లడిల్లిపోయాడు. ఆమె తనను చంపేకంటే ముందు తానే చనిపోవాలనుకున్నాడు.
ఆత్మహత్యకు ముందు ఓ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. తన ఆవేదనను మొత్తం అందులో రికార్డు చేశాడు. తనకు వ్యవస్థమీద నమ్మకం ఉందని, తన భార్యను కఠినంగా శిక్షించి తనకు న్యాయం చేయాలని వీడియో ద్వారా కోరాడు. అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. వీడియో ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Guntur: వివాహేతర సంబంధం.. ప్రియుడి చేతిలో గ్రామ వాలంటీర్ దారుణ హత్య!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.