దేశంలో తాజాగా జరిగిన ఓ సర్వేలో పెళ్లికాని ప్రసాదుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందని వెల్లడైంది. దీంతో యువత ఆలోచనలో మార్పు రావడంతో పెళ్లిళ్లు చేసుకోవడానికి వెనకడుగు వేస్తున్నారట. ఇలా నేటి కాలం యువత పెళ్లి చేసుకోవడానికి జంకుతుంటే శివ శంకర్ అనే ఒకతను మాత్రం ఏకంగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 మందిని పెళ్లి చేసుకుని సంచలనంగా మారాడు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన ఈ కేసులో మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే? ఒకే ఏరియాలో ఏడుగురి భార్యలతో కాపురం పెట్టి గుట్టుచప్పుడు కాకుండా సాగించిన ఇతని వ్యహారం ఎట్టకేలకు బయటపడిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల అనుమానం వచ్చిన ఓ భార్య భర్తను నిలదీయగా అతగాడి అసలు గుట్టు రట్టు అయింది. దీంతో ఆ మహిళల పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. అయితే ఈ విచారణలో మాత్రం తాజాగా మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Krishna District: భర్త కూలీ.. ప్రియుడు పోలీస్! అత్యాశకి పోయి ఓ భార్య దారుణం!
అతను 11 మందిని మాత్రమే పెళ్లి చేసుకోలేదని, ఇంకా చాలా మందిని పెళ్లి చేసుకున్నట్లుగా బాధిత మహిళలు ఆరోపిస్తున్నారు. ఇద్దరు భార్యలు ఇతగాడి లీలలు బయటకు తీసుకొస్తు అతనిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక వీళ్లకు తోడుగా మహిళా సంఘాల అండ తోడవ్వడంతో ధర్నాలు చేస్తూ నిత్యపెళ్లికొడుకును వెంటనే అరెస్ట్ చేసి బాధిత మహిళలకు న్యాయం చేయాలని ఆరోపిస్తున్నారు.
దీంతో ఇప్పటికీ కూడా నిత్యపెళ్లికొడుకు శివశంకర్ ను పోలీసులు అరెస్ట్ చేయకపోవడం విశేషం. అతగాడు మాత్రం నేను గుంటూరులోనే ఉన్నాను, నన్ను అరెస్ట్ చేయండంటూ కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారిన నిత్యపెళ్లికొడుకు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. తీగలాగితే డొంకకదులుతున్న నిత్యపెళ్లికొడుకు వ్యవహారంలో మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలోతెలియజేయండి.