ఈ రోజుల్లో కొందరు అమ్మాయిలు చిన్న చిన్న విషయాలకే క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రేమలో విఫలమయ్యానని, తల్లిదండ్రులు మందలించారని.., ఇలా కారణాలు వేరైన అమ్మాయిలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. సరిగ్గా ఇలాగే బీటెక్ చదువుతున్న ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా నూజివీడు మండలం సూరేపల్లి. ఇదే గ్రామానికి చెందిన యునీలా అనే యువతి ఆర్‌వీఆర్‌జేసీ కళాశాలలో బీటెక్ చదువుతోంది. అయితే అప్పటి వరకు బాగానే ఉన్న ఆ యువతి ఏం జరిగిందో ఏమో ఉన్నట్టుండి షాకింగ్ డిసిషన్ తీసుకుంది. తాను ఉంటున్న హాస్టల్ భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రుల కన్నీరు మున్నీరుగా విలపించారు.
ఈ ఘటనపై వెంటనే స్పందించిన స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. అసలు యునీలా ఆత్మహత్యకు కారణం ఏంటి? ఆమెకు ఏమైన ప్రేమ వ్యవహారాలు ఉన్నాయా? లేక మరేదైన కారణమా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. యువతి ఆత్మహత్యపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.