మారుతున్న కాలానికి అనుగుణంగా లైంగిక వేధింపులు కూడా ఎక్కువవుతున్నాయి. కొందరు వ్యక్తులు వావివరసలు మరిచి బరితెగించి ప్రవర్తిస్తున్నారు. ఏపీలో ఓ సొంత మామ భర్త లేని సమయం చూసి ఏకంగా కోడలిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లాలో ఓ దంపతులకు గతంలోనే వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు.
ఇది కూడా చదవండి: భర్తను చంపిన భార్య! చంపటానికి కారణం తెలిసి బిత్తరపోయిన పోలీసులు!
ఆ మహిళ ఎంఏ చదువుకుని స్థానిక కళాశాలలో అద్యాపకురాలిగా పని చేస్తుంది. అయితే తన భర్త నైట్ డ్యూటీలోకి వెళ్తుండడంతో సొంత మామ( ఓ మాజీ ఎస్సై) ఏకంగా కోడలిపై కన్నేశాడు. భర్త నైట్ డ్యూటీకి వెళ్లగానే కోడలిపై లైంగిక వేధింపులకు గురి చేశాడు. అయితే మామ వేధింపులు రోజు రోజుకు ఎక్కువ అవ్వడంతో కోడలు తట్టుకోలేకపోయింది. ఇదే విషయాన్ని నేరుగా కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది. ఎలాగైన తన మామ వేధింపుల నుంచి నాకు రక్షణ కల్పించాలని కోరుతూ ఎస్పీని వేడుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.