ఏపీలోని తెనాలి మారీస్ పేటలో దారుణం చోటు చేసుకుంది. రూ. 2000 రూపాయల కోసం దుండగులు ఓ యువకుడి దారుణంగా హత్య చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తెనాలి మారీస్ పేటలో సందీప్ అనే యువకుడు 24వ వార్డు వాలంటీర్ గా పని చేస్తున్నాడు. అదే కాలనీకి చెందిన ఓ మైనర్ బాలుడు గతంలో సందీప్ వద్ద రెండు వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు.
అయితే ఇచ్చిన రెండు వేలు ఇవ్వాలంటూ గతంలో అనేక సార్లు సందీప్ అడిగే ప్రయత్నం చేశాడు. కాగా గురువారం సాయంత్రం సమయంలో సందీప్, ఆ మైనర్ బాలుడు వద్దకు వెళ్ళి తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వమని అడిగాడు. తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమనడంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అదే సమయంలో మైనర్ బాలుడు తండ్రి కూడా వచ్చాడు. ఇద్దరూ కలిసి సందీప్ పై చేసిన దాడిలో సందీప్ అక్కడిక్కడే కూలబడి చనిపోయాడు. ఇద్దరూ కలిసి చేసిన దాడిలో గుండెపై బలంగా దెబ్బలు తగలటం తోనే సందీప్ చనిపోయాడని అతని బంధువులు ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Whatsapp: ప్రియుడు వాట్సాప్‌లో బ్లాక్ చేశాడని యువతి ఆత్మహత్య
ఇక కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కేవలం రూ.2000 లకే ఓ మనిషి ప్రాణాన్ని తీయడమేంటని స్థానికులు వాపోతున్నారు. సమాజంలో ఇలాంటి చిన్న చిన్న కారణాలకు క్షణికావేశంలో కొందరు వ్యక్తులు ఊహించని నిర్ణయాలు తీసుకుంటన్నారు. ఇంతటితో ఆగకుండా చివరికి ఊహించని దారుణాలకు తెగబడుతున్నారు. ఇలాంటి ఘటనలు రోజు రోజుకు అనేకం చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తెనాలిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.