సాఫీగా సాగిపోతున్న భార్యాభర్తల కాపురాల్లో వివాహేతర సంబంధాలు వచ్చి చేరి వారి సంసారాలను నాశనం చేస్తున్నాయి. ఇక భర్తను కాదని కొంతమంది భార్యలు వివాహేతర సంబంధాల్లో పాలు పంచుకుంటున్నారు. కొంత కాలం ప్రియుడితో కలిసి తిరిగి కాస్త తేడా వచ్చే సరికి చివరికి అతడి చేతిలోనే హత్యకు గురువుతున్నారు. తాజాగా ఇలాంటి కేసులోనే ఓ గ్రామ వాలంటీర్ ప్రియుడితో చేతిలో దారుణ హత్యకు గురైంది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
ఇక పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. గుంటూరు జిల్లాలోని చావలి గ్రామం. ఇదే గ్రామానికి చెందిన దొప్పలపూడి శారద గ్రామ వాలంటీర్ గా పని చేస్తూ ఉంది. ఈమెకు గతంలోనే వివాహం అయి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే మద్దా పద్మారావు అనే వ్యక్తితో శారద వివాహేతర సంబంధాన్ని నడిపిస్తూ ఉంది. శారద భర్తకు తెలియకుండా ఈ వ్యవహారాన్ని ఎంచక్కా ముందుకు
తీసుకెళ్లింది.
ఇది కూడా చదవండి: Karnataka: భర్తను కాదని వివాహేతర సంబంధం.. పిల్లల ముందే తల్లిని హత్య చేసిన ప్రియుడు!
అయితే ఏం జరిగిందో ఏం తెలియదు కానీ ఇద్దరి మధ్య కొన్నాళ్ల నుంచి మనస్పర్ధలు వచ్చి చేరాయి. అయితే శారద ఆదివారం సాయంత్రం 6 గంటలకు ఇంటి వద్ద పనులు చేస్తూ ఉంది. కాగా పద్మారావు ఆమె వద్దకు చేరుకుని ఇంట్లోకి రావాలని పిలిచాడు. వెంటనే వచ్చిన శారదను పద్మారావు కత్తితో దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. దీంతో రక్తపు మడుగులో పడి ఉన్న శారదను చూసి స్థానికులు అంత షాక్ కు గురయ్యారు.
వెంటనే శారదను ఆస్పత్రి తరలించే ప్రయత్నం చేశారు. అయినా అప్పటికే శారద ప్రాణాలు విడిచింది. ఇదే దారుణ ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నపోలీసులు పరిశీలించారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలంగా మారింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.