అతడు పేరుకే కానిస్టేబుల్. ఖాకీ చొక్క ధరించి ఆ ముసుగులో ఎంతోమంది అమాయక ప్రజలను మోసం చేశాడు. ఇతడి దారుణం వెలుగులోకి రావడంతో తాజాగా జైలుకు తరలించారు. ఇంతకి ఇతగాడు చేసిన మోసం ఏంటో తెలిస్తే షాకవుతారు.
ఈ మధ్యకాలంలో కొందరు ప్రభుత్వ అధికారులు బరితెగించి ప్రవర్తిస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసు అధికారులే నేరాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనలు గతంలోనే చాలానే చూశాం. అయితే ఓ వ్యక్తి మాత్రం కానిస్టేబుల్ ముసుగులో ఉండి ఎవరూ ఊహించని పాడు పనులకు తెరలేపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు ఒక్కసారిగా తలలు పట్టుకున్నారు. ఇక నేరం రుజువు కావడంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమంగా మారింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో పాకాటి గోవిందరావు అనే వ్యక్తి పోలీస్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించాడు. ఉద్యోగంలో చేరిన మొదట్లో బాగానే పని చేశాడు. ఇక ఇక రాను రాను గోవిందరావు తన అసలు క్యారెక్టర్ ను బయటపెట్టి మోసాలకు పాల్పడ్డాడు. ఇంతకి ఇతగాడు చేసిన మోసం ఏంటో తెలుసా? మంగళగరి స్టేషన్ లో విధులు నిర్వర్తించిన రోజుల్లో అతడు స్థానిక ప్రజలతో పరిచయాలు పెంచుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా కూడా ఎంతో మందితో స్నేహం చేశాడు. ఇదిలా ఉంటే.. వివిధ గొంగతనాల కేసుల్లో రికవరీ చేసిన బంగారం ఉందని ఎంతోమంది అమాయక ప్రజలను నమ్మించాడు. వీటిని తక్కువ ధరకే విక్రయిస్తానని మోసం చేశాడు.
ఇతడి మాటలు విన్న చాలా మంది డబ్బులు ఇచ్చారు. ఇక చాలా రోజులు గడిచినా కానిస్టేబుల్ గోవిందరావు డబ్బులు ఇవ్వకపోగ, బంగారం కూడా వారికి ఇచ్చింది లేదు. దీంతో ఎన్నో సార్లు డబ్బులు తిరిగి ఇవ్వాలని బాధితులు అతడిని కోరేవారు. గోవిందరావు మాత్రం.. డబ్బులు ఇవ్వకపోగ వారిపై బెదిరింపులకు దిగేవాడు. ఇక మోసపోయామని గ్రహించిన బాధితులు.. కానిస్టేబుల్ గోవిందరావుపై వివిధ స్టేషన్ లలో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించారు. గోవిందరావు నేరం రుజువు కావడంతో న్యాయంస్థానం అతడికి జైలు శిక్ష విధించింది. కొన్ని రోజులు రాజమండ్రి సబ్ జైల్లో ఉన్న ఈ మోసగాడు.. తిరిగి బెయిల్ పై బయటకు వచ్చాడు.
ఇక వచ్చిన తర్వాత బుద్దిగా ఉంటాడని అందరూ అనుకున్నారు. కానీ, కుక్కతొక వంకర అన్నట్లు మళ్లీ అదే మోసానికి తెర లేపాడు. మరోసారి బాధితులు గోవిందరావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకోవడంతో పాటు ఏకంగా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీనిపై స్పందించిన ఎస్పీ ఇతడి వ్యవహారంపై విచారణ చేపట్టారు. ఇక తాజాగా న్యాయస్థానం విచారణ చేపట్టి రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు గోవిందరావును అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఇదిలా ఉంటే.. కానిస్టేబుల్ మసుగులో గోవిందరావు.. ఏకంగా 5 ఏళ్లలో ఎంతో మంది అమాయక ప్రజలను మోసం చేశాడు. బాధితుల నుంచి సుమారుగా రూ.2.50 కోట్ల లబ్ది పొందినట్లు తేలింది.