యువతి, యువకుడిది ఒకే ఊరు. వీరికి గతంలో కాస్త పరిచయం ఉండేది. ఈ పరిచయంతోనే రోజూ ఫోన్ లు మాట్లాడుకునేవారు. ఇక రాను రాను వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారు. అంతేకాకుండా చివరికి పెద్దలను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కానీ.. ఆ ఒక్క కారణంతోనే చివరికి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.
ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ఇద్దరిది ఒకే ఊరు కావడంతో కాస్త పరిచయం ఉండేది. ఈ పరిచయంతోనే చివరికి ప్రేమికులుగా మారిపోయారు. ఇక రాను రాను ఒకరిని విడిచి మరొకరు ఉండలేనంతగా తయారయ్యారు. అంతటి ప్రేమలో ఉన్న ఈ ప్రేమ జంట.. ఎలాగైనా తల్లిదండ్రులను ఒప్పించి ఘనంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అలా కొన్ని రోజులు వెయిట్ చేశారు. చివరికి తల్లిదండ్రులను ఎదురించైనా సరే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. కట్ చేస్తే.. ఆ ప్రేమికులు రైలు పట్టాలపై శవాలపై కనిపించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. అది ఏపీలోని గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సెలపాడు. ఇదే గ్రామంలో ఉయ్యూరు శ్రీకాంత్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. అయితే ఇదే గ్రామానికి చెందిన పులి త్రివేణి అనే యువతి తెనాలిలో డిగ్రీ చదువుకునేది. శ్రీకాంత్, త్రివేణిది ఒకే ఊరు కావడంతో ఇద్దరికీ కాస్త పరిచయం ఉండేది. ఆ పరిచయంతోనే ఇద్దరూ ఇంకాస్త దగ్గరయ్యారు. దీంతో రాను రాను ఈ యువతి యువకుడు ప్రేమించుకున్నారు. ఇక చివరికి పెద్దలను ఒప్పించి ఘనంగా వివాహం చేసుకోవాలని అనుకున్నారు. అలా వీరి ప్రేమాయణం గత కొన్నేళ్ల పాటు కొనసాగుతూ వచ్చింది.
ఇకపోతే.. వీరి ప్రేమ వ్యవహారం ఇటీవల ఇరువురి తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో కోపంతో ఊగిపోయిన యువతి యువకుడు తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించలేదు. వీరికి నిర్ణయానికి తల్లిదండ్రులు వ్యతిరేకంగా మాట్లాడడంతో శ్రీకాంత్, త్రివేణి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఆ సమయంలో వీరికి ఏం చేయాలో తోచలేదు. ఇక బతికుండగా మేము కలిసి ఉండలేం అనుకున్నారో ఏమో తెలియదు కానీ.. గత రెండు రోజుల క్రితం త్రివేణి కాలేజీకి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. సాయంత్రం అయినా కూతురు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో త్రివేణి తల్లిదండ్రులు అటు ఇటు అంతటా వెతికారు.
అయినా ఆ యువతి ఆచూకి మాత్రం దొరకలేదు. ఏం చేయాలో అర్థం కాని త్రివేణి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు స్థానిక ప్రాంతాల్లో గాలించారు. కట్ చేస్తే.. బుధవారం సుద్దపల్లి రైల్వే గేట్ పై ఓ యువతి, యువకుడి మృతదేహాలు కనిపించాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. వెంటనే త్రివేణి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన వచ్చిన ఆ యువతి తల్లిదండ్రులు సుద్దపల్లి రైల్వే ట్రాక్ పై పడి ఉన్న యువతి మృతదేహాన్ని తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు.
ఆ అమ్మాయి మా కూతురే అంటూ పోలీసుల ముందు బోరున విలపించారు. అనంతరం శ్రీకాంత్ తల్లిదండ్రులు సైతం అక్కడికి చేరుకుని కుమారుడిని అలా చూసి కన్నీరు మున్నీరుగా విలిపించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించని కారణంగానే త్రివేణి, శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నారని స్థానికులు తెలిపారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ప్రేమకు పెద్దలు అంగీకరించలేదని ఆత్మహత్య చేసుకున్న ఈ ప్రేమజంట నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.