ఈ మధ్యకాలంలో అనేక మంది అమ్మాయిలు పెళ్లి పేరుతో మోసం చేస్తున్నారు. యువకుడిని నమ్మించి పెళ్లి పేరుతో అన్ని దోచుకుని చివరకి భర్తకు షాక్ ఇస్తూ చిక్కెస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ మహిళ పెళ్లి పేరుతో భర్తకు పంగనామాలు పెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. తాజాగా గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుంటూరుకు చెందిన శ్రీనివాసరావు బీటెక్ చదివి ప్రస్తుతం మోటో కంట్రోలర్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు.
తండ్రి పోలియోతో, తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారు. రెవిన్యూ డిపార్ట్‌మెంట్ లో ఓ రిటైర్డ్ ఉద్యోగి ద్వారా ఓ పెళ్లిసంబంధం వచ్చింది. ఇరువురికి నచ్చడంతో ప్రియ అనే యువతితో పెళ్లికి ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారు. అయితే అమ్మాయికి తండ్రిలేరని శ్రీనివాస్ మంచి మనసుతో కట్నం కూడా తీసుకోకుండా గతేడాది పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి టైంలో ఉన్నదాంట్లోనే అమ్మాయికి రెండు లక్షలు పెట్టి బంగారం కూడా చేయించాడు. బంధువుల సమక్షంలో గ్రాండ్‌గా రూ.6లక్షలతో ఊర్లోనే రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
ఇది కూడా చదవండి: Mahabubabad: వాట్సాప్‌లో ప్రచారం.. ఊర్లో పంచాయతీ.. మహిళ బలి!
పెళ్లికి వచ్చిన వాళ్లంతా వధువరుల జంట చూడముచ్చటగా ఉందని ఆశీర్వదించారు. అయితే పెళ్లైన నాటి నుంచి ప్రియ భర్తను దగ్గరకు రానివ్వకుండా ఏదో వంకలు పెడుతూ దూరం దూరంగా ఉంటుంది. ఇటీవల మా తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి బాగలేదని పుట్టింటికి వెళ్లింది. రెండు మూడు నెలల అయినా భర్త వద్దకు రాలేదు. దీంతో ఏంటని భర్త ఆరా తీసే సరికి ఈ యువతికి గతంలో ఓ యువకుడితో పెళ్లికి జరిగిందని తెలుసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యాడు. నన్ను మోసం చేశారని భావించి యువతి కుటుంబ సభ్యులపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.