గుంటూరులో దారుణం చోటు చేసుకుంది. లోన్ యాప్ ద్వారా తీసుకున్న సొమ్మును తిరిగిచ్చే క్రమంలో నిర్వాహకుల వేధింపులు ఎక్కువయ్యాయి. లోన్ తీర్చకపోతే ప్రైవేట్ ఫోటోలు బయటపడతామని వేధించడంతో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడింది. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..మంగళగిరి మండలం చిన్నకాకాని గ్రామానికి చెందిన బండపల్లి ప్రత్యూష అనే మహిళ గత కొన్ని రోజుల కిందట ఇండియన్ బుల్స్, రూపెక్స్ యాప్స్ నుంచి రూ.20,000 లోన్ తీసుకుంది.
అయితే ఆమె తీసుకున్న రూ.20 వేల రుణానికి లోన్ యాప్స్ నిర్వాహకులు ఏకంగా రూ. 2 లక్షల వరకు వసూలు చేశారు. అయినా ఇంకా చెల్లించాల్సిన డబ్బులు కట్టాలని, లేకుంటే ప్రైవేటు ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. ఇది నిజమేనని భావించిన ఆ మహిళ తట్టుకోలేపోయింది. ఈ క్రమంలోనే లోన్ నిర్వాహకుల వేధింపులు ఎక్కువవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది.
ఇది కూడా చదవండి: Gujarat: దారుణం: కన్న తల్లిని గొంతు కోసి చంపిన కసాయి కొడుకు
ఏం చేయాలో తెలియక ఇంటిపైనున్న ఫ్లెక్సీ హోర్డింగ్ కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.అయితే తాను ఆత్మహత్య చేసుకునే ముందు భర్తకు, తల్లిదండ్రులకు వీడియో కాల్ చేసి మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.