వ్యభిచారం.. ఆడవాళ్ల శరీరాలను ఆట బొమ్మలుగా మలిచి అందానికో రేటు అంటూ అమ్మాయిల శరీరాలతో అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. పరదాల మాటున చీకటి దందాకు తెరలేపుతూ అనేక మంది అమ్మాయిలను వ్యభిచార రొంపిలోకి దింపి ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. ఇక కష్టపడకుండా ఇదే ఈజీ బిజినెస్ అంటూ కొందరు కేటుగాళ్లు గుట్టుచప్పుడు వ్యభిచారాన్ని నిర్వహిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ పోలీసులు అంతర్జాతీయ సెక్స్ రాకేట్ గుట్టును రట్టు చేసి దాదాపుగా వేల మంది బాధితులను రక్షించి నిందితులను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటన మరవకముందే తాజాగా మరో సెక్స్ రాకెట్ ఏపీలోని గుంటూరు జిల్లాలో వెలుగు చూసింది.
కష్టపడి సంసాదించకుండా కొందరు లాడ్జి నిర్వాహకులు వ్యభిచారాన్ని నిర్వహిస్తూ చీకటి దందాకు తెర లేపుతున్నారు. అయితే వ్యభిచారంలో భాగంగా.. కొందరు లాడ్జి నిర్వాహకులు అమ్మాయిలను పిలిపించి వారితో రేటు మాట్లాడుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. అది ఏపీలోని గుంటూరు జిల్లా కొత్తపేట ప్రాంతం. ఇక్కడే గత కొంత కాలం నుంచి కొందరు లాడ్జి నిర్వాహకులు వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులు ఏదో నామ మాత్రంగా దాడులు నిర్వహించి చేతులు దులుపుకున్నారు. కానీ ఆ దాడులు మరువకముందే తాజాగా కొత్తపేట మరో వీడియో కాస్త వైరల్ గా మారుతోంది.
ఈ వీడియోలో ముగ్గురు మహిళలతో పాటు మరో ముగ్గురు యువకులు ఉన్నట్లుగా స్పషంగా అర్థమవుతోంది. మేము ముగ్గురం రాత్రి మీతో పడుకుంటే రేటు ఎంత? అని యువకులు అడగగా.. వ్యభిచార నిర్వాహకులు రూ.1000 తప్పదు. మహా అయితే 100 తగ్గిస్తారు అనే మహిళ తరుఫున రేటును మాట్లాడుకుంటున్నారు. ఆ యువకుల మాటలు విన్న అక్కడున్న మహిళలు నవ్వుకుంటున్నారు. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారుతోంది. అయితే ఇంత ధైర్యంగా, బహిరంగంగా వ్యభిచారం నడిపిస్తుంటే పోలీసులు చూసి చూడనట్లుగా వదిలేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. దీనిపై స్థానిక పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.