కొత్తగా పెళ్లైన జంట. ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. ఇక అనుకున్నట్లుగానే కుటుంబ పెద్దలు వారికి ఫస్ట్ నైట్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ కొత్తగా పెళ్లైన యువకుడు మాత్రం ఫస్ట్ నైట్ కి భయపడి ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అది గుంటూరు జిల్లా తాడేపల్లిలోని మాచర్ల సాగర్ రింగ్‌రోడ్ ప్రాంతం. ఇదే గ్రామానికి చెందిన పత్తిగుడుపు కిరణ్‌కుమార్ అనే యువకుడికి ఈ నెల 11వ తేదీ తెనాలి వించిపేటకు చెందిన యువతితో వివాహం జరిగింది. ఇక 12వ తేదీ భార్యను తీసుకుని మాచర్ల వెళ్లాడు. 16వ తేదీ మొదటి రాత్రి ఏర్పాటు చేశారు. దీంతో తెనాలి వచ్చేందుకు బయలుదేరిన కిరణ్‌కుమార్ గుంటూరు బస్టాండ్‌లో బసు దిగి ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్లిపోయాడు.
ఇది కూడా చదవండి: అవును.. అతని పీక కోసింది నేనే! ఎందుకు అలా చేశానంటే?
కొత్తగా పెళ్లైన పెళ్లి కూతురు భర్త వస్తానని చెప్పి ఇంకా రావడం లేదు. ఫోన్ చేస్తే స్విచ్చాఫ్. ఏం చేయాలో తెలియక ఇంటికి వెళ్లి అత్తింటివాళ్లకు వివరించింది. దీంతో రాత్రి అయినా కిరణ్ కుమార్ రాకపోవడంతో ఖంగారు పడి కుటుంబ సభ్యులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా కృష్ణానది ఎగువ ప్రాంతంలో కిరణ్ కుమార్ మృతదేహం ఉందని సమాచారం అందింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు శవాన్ని బయటకు తీసి పరిశీలించారు. పూర్తిగా కుళ్లిపోయిన అతడి శవాన్ని చూసి పోలీసులు ఖంగుతిన్నారు.
వెంటనే సమాచారాన్ని కిరణ్ కుమార్ బంధువులకు తెలిపారు. ఇక విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.తమ కుమారుడు ఫస్ట్ నైట్ అంటే భయపడ్డాడని, అందుకే బలవన్మరణానికి పాల్పడ్డాడని బోరున విలపించారు. స్నేహితులు, కుటింభికులు ఎంత చెప్పినా వినకుండా ఈ నిర్ణయం తీసుకున్నాడని మృతుడి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫస్ట్‌నైట్ అంటే భయపడి బలవన్మరణానికి పాల్పడ్డ యువకుడి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.