ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతుంది. కొంతమంది లైసెన్స్ లేని గన్స్ అక్రమంగా కొనుగోలు చేసి బెదిరింపులకు పాల్పపడుతున్నారు. రియల్ ఎస్టేట్, ఇతర ఆర్థిక లావా దేవి విషయాల్లో ఎదుటి వారిని బెదిరించడానికి గన్స్ ఉపయోగిస్తున్నారు. కొన్నిసార్లు తుపాకీ కాల్పుల్లో చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి.
ఈ మద్య తెలుగు రాష్ట్రాల్లో గన్ కల్చర్ బాగా పెరిగిపోయింది. ఇటీవల కొంతమంది కేటుగాళ్ళు అక్రమార్కుల నుంచి లైసెన్స్ లేని గన్స్ కొనుగోలు చేసి పలు నేరాలకు పాల్పపడుతున్నారు. తాజాగా ఉమ్మడి కడప జిల్లా పులివెందులలో మంగళవారం కాల్పులు కలకలం రేపింది. భరత్ కుమార్ యాదవ్ అనే ఓ వ్యక్తి ఇద్దరిని తుపాకీతో కాల్చాడు. ఈ ఘటన లో దిలీప్, మహబూబ్ భాషాల కు తీవ్రంగా గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ దిలీప్ అనే వ్యక్తి మరణించాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్ వైఎస్సాఆర్ జిల్లా, సీఎం సొంత నియోజకవర్గం అయిన పులివెందులలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. భరత్ కుమార్ యాదవ్ అనే ఓ వ్యక్తి తుపాకీతో దీలీప్, మహబూబ్ భాషా లపై నిర్ధాక్షిణ్యంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో గాయపడ్డ ఇద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, భరత్ కుమార్ యాదవ్ ని గతంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు సీబీఐ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. భరత్ కుమార్ యాదవ్ కి పులివెందుల పట్టణంలో గొర్రెల వ్యాపారిగా ఉన్న దిలీప్ కి మద్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. గత వారం నుంచి నుంచి ఇద్దరి మద్య డబ్బుల వ్యవహారంలో గొడవలు నడుస్తున్నాయి. తన అప్పు తీర్చాల్సిందిగా దిలీప్ పై భరత్ కుమార్ యాదవ్ తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చాడు.
ఈ క్రమంలోనే పులివెందులలోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద భరత్ కుమార్ యాదవ్ తన వెంట తీసుకు వచ్చి తుపాకీతో దిలీప్ పై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ దాడిలో దిలీప్ ఛాతి, నుదిటిపై గాయం అయ్యింది.. అదే సమయంలో పక్కనే ఉన్న మహబూబ్ బాషా తన స్నేహితుడైన దిలీప్ ని రక్షించే ప్రయత్నం చేశాడు. అతడిపై కూడా భరత్ కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరూ తీవ్ర గాయాలతో అక్కడే పడిపోయారు. కాల్పులు జరిపిన అనంతరం భరత్ అక్కడ నుంచి పారిపోయాడు. స్థానికులు వెంటనే బాధితులను పులివెందుల ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. ప్రాథమిక చికిత్స అనంతరం దిలీప్ పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రీమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా, చికిత్స పొందుతూ దిలీప్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇదిలా ఉంటే.. గతంలో వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరైన భరత్ కుమార్ కి తుపాకీ ఎక్కడ నుంచి వచ్చిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ప్రస్తుతం భరత్ కుమార్ పరారీలో ఉన్నాడు.