గుజరాత్ లో దారుణం చోటు చేసుకుంది. నవమాసాలు మోసి కనిపించిన తల్లినే ఓ కొడుకు అతి భయంకరంగా కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. అసలేం జరిగిందంటే? అది గుజరాత్ లోని వర్థమాన్ నగర్. ఇదే ప్రాంతంలో మహేష్ పంచాల్, ఛాయ పంచల్ అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి ఓ జయేష్ పంచల్ అనే కుమారుడు కూడా ఉన్నాడు. ఇతడు బీటెక్ పూర్తి ఇంటివద్దే ఉంటున్నాడు.
అయితే జయేష్ గత కొన్ని రోజుల నుంచి డిప్రెషన్ లోకి వెళ్లాడ. దీంతో కుమారుడి ఆరోగ్య పరిస్థితిని గమనించి తల్లి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. ఈ క్రమంలోనే కుమారుడు జయేష్ ఇటీవల ఆస్థిలో వాటా కావాలంటూ గత కొన్ని రోజుల నుంచి తల్లిని వేధిస్తున్నాడట. ఇదే విషయమై జయేష్ తన తల్లితో గొడవకు కూడా దిగాడు. దీంతో మానసికంగా బాగలేని జయేష్ తాజాగా తల్లి నిద్రిస్తుండగా ఆమెను గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు.
ఇది కూడా చదవండి: Rajasthan: ఇద్దరు యువకులతో యువతి రిలేషన్.. చివరికి ట్విస్ట్ ఏంటంటే?
అనంతరం అక్కడి నుంచి పరారై బెంగాలీ భాషలో.. ఐలవ్ యూ డాడీ.. అమ్మ చావుకు నేనే కారణం. నేనే చంపేశా.. నన్ను క్షమించు అంటూ ఓ లేఖను ములంద్ రైల్వే స్టేషన్ వద్ద ఉంచి తాను రైలు కింద పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో వెంటనే స్పందించిన స్థానికులు హుటాహుటిన జయేష్ ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఇక ఇదే విషయం తండ్రి మహేష్ కు తెలియడంతో భార్య మరణించిన బాధని దిగమింగుకోలేక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. కన్న తల్లిని దారుణంగా హత్య చేసిన ఈ కసాయి కొడుకు అఘాయిత్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.