ఈ మద్య కొంత మంది చిన్న చిన్న విషయాలకు మనస్థాపానికి గురై ప్రాణాలు తీసుకునే స్థాయికి వెళ్తున్నారు. క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలతో కుటుంబ సభ్యులు ఇబ్బందుల పాలవుతుంటారు. ఓ వ్యక్తి తన భార్య, బావమరిది బీఫ్ తినమని ఒత్తిడి చేయడంతో తిన్నాడు.. తర్వాత తాను ఎంతో పాపం చేశానని.. తనకు బతికే అర్హత లేదని ఆత్మహత్య చేసుకున్నాడు. గుజరాత్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
రోహిత్ ప్రతాప్ సింగ్ ఇటీవల తాను పని చేస్తున్న చోట సోనమ్ అనే మహిళను కలుసుకున్నాడు. కొంతకాలం తర్వాత వీరి స్నేహం ప్రేమగా మారింది. సోనం ముస్లిం మహిళ కనుక ప్రతాప్ ఇంట్లో ఒప్పుకోలేదు. కానీ పెద్దలను ఎదిరించి సోనమ్ ని పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం వీరి సంసారం సాఫీగా సాగింది. అంతలోనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఎలాంటి ఇబ్బందులు లేని రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ సంవత్సరం జూన నెలలో రోహిత్ ని భార్య సోనమ్, భావమరిది అక్తర్ అలీ బలవంతంగా బీఫ్ తినాలని చెప్పారట. మొదట్లో తనకు ఇష్టం లేకపోయినా.. భార్య బెదిరించడంతో తప్పని సరి పరిస్థితిలో తిన్నాడు. బీఫ్ తినడం తట్టుకోలేక రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఆత్మహత్యకు ముందు ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ‘నాకు ఇష్టం లేకపోయినా.. నా భార్య, భావమరిది బలవంతంగా నాతో బీఫ్ తినిపించారు. నాకు ఈ లోకంలో బతికి ఉండేందుకు అర్హత లేదు. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నాకు న్యాయం చేయండి ’ ఫేస్ బుక్ లో సూసైడ్ నోట్ రాశాడు. ఇది కాస్త రోహిత్ స్నేహితుడి కంట పడింది.
రోహిత్ చనిపోయే ముందు ఎంతో మానసిక ఆవేదనకు గురయ్యాడని.. సూసైడ్ నోట్ విషయాన్ని రోహిత్ తల్లి వీణదేవికి చూపించారు. తమకు ఇష్టం లేకున్నా కొడుకు ప్రేమించాడని పెళ్లికి ఒప్పుకున్నామని.. ఇలా చేస్తుందని ఊహించలేదని వీణాదేవి కన్నీరు మున్నీరయింది. తన కొడుకు చావుకు కారణం అతని భార్య, ఆమె సోదరుడే అని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు.
Hindu man dies by suicide after Muslim wife, brother-in-law forcefully feed him beef in Surat https://t.co/L5OShL8w1V via @indiatoday
— sekhar (@sekhar31000123) August 29, 2022